102,104,108 వాహనాల్లో భారీ సంఖ్యలో డ్రైవర్ ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఈ మధ్య కాలంలో వరుస జాబ్ నోటిఫికేషన్లు వెలువడుతుండగా చిత్తూరు జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రయోజనం చేకూరే విధంగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 102,104,108 వాహనాల్లో డ్రైవర్లుగా పని చేయాలని భావించే వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు. హెవీ లైసెన్స్, బ్యాడ్జ్ కలిగి పదో తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.

గరిష్టంగా 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రైవింగ్ లో కనీసం మూడేళ్ల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. 108లో ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 15,000 రూపాయల వేతనం లభించనుంది. 102,104 వాహనాల్లో డ్రైవర్ గా పని చేసేవాళ్లకు 12,000 రూపాయలు లభిస్తుంది.

చిత్తూరు జిల్లా, కార్వేటు నగరం, పలమనేరు ప్రాంతాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. నవంబర్ నెల 29వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో మేలు జరుగుతోంది.

అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. డ్రైవర్ ఉద్యోగ ఖాళీల కోసం ఎదురుచూసేవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను సమీపంలోని 108, 104 కార్యాలయాలను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు.