సాధారణంగా చాలామంది తమ సంపాదనలో కొంత భాగం భవిష్యత్తు కోసం పొదుపు చేయాలని భావిస్తూ ఉంటారు. ఇలా పొదుపు చేసిన డబ్బును ని పిల్లల చదువు, పెళ్లిళ్లు, వృద్దాప్యంలో అవసరాల కోసం ఉపయోగిస్తారు. అయితే ఎలాంటి రిస్క్ లేకుండా భవిష్యత్తు కోసం డబ్బు పొదుపు చేయటానికి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఉత్తమమైనవి. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న స్కీమ్స్ ద్వారా ప్రజలు ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు. పిల్లల కోసం కూడా పోస్ట్ ఆఫీస్ కొన్ని స్కీమ్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ స్కీం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
భవిష్యత్తు కోసం డబ్బు పొదుపు చేయాలనుకునేవారు ఈ స్కీమ్ లో మీరు డబ్బులు పెడితే అధిక లాభం పొందవచ్చు. ఈ స్కీం ద్వారా ప్రతీ నెలా రూ.10 వేలు డిపాజిట్ చేస్తూ వెళితే మెచ్యూరిటీ సమయానికి రూ. 16 లక్షల వరకు పొందొచ్చు. అంతే కాకుండా రికరింగ్ డిపాజిట్ కి 5.8% వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ ప్రతి మూడో నెలలకి కాంపౌండింగ్ మొత్తం తో యాడ్ అవుతుంది. దీనిపై వచ్చే రిటర్న్స్ వల్ల మీకు ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. పోస్ట్ ఆఫీస్ లో రికరింగ్ డిపాజిట్ స్కీం లో ఇన్వెష్ట్ చేయాలనుకునేవారు కేవలం
రూ. 100 తో ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు.
రూ.100 తో అకౌంట్ ఓపెన్ చేసిన ఈ స్కీమ్ లో మీరు ఎంతైనా సరే పెట్టచ్చు. అయితే ఈ పథకం లో మీరు 10 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రతీ నెలా రూ. 10 వేలు పెట్టుబడితో 10 సంవత్సరాల పాటు ఈ స్కీం కొనసాగిస్తే ఏడాదికి లక్షా 20 వేల చొప్పున 10 ఏళ్లకు రూ. 12 లక్షలు పొందవచ్చు. ఏడాదికి రూ. 12 లక్షల రూపాయలకి 5.8 శాతం తో వడ్డి పొందవచ్చు . ఇలా 10 సంవత్సరాల పాటు మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం తో పాటు వడ్డీ కలిపి రూ.16,15,721 పొందొచ్చు. అయితే ప్రతి నెల రూ. 10 వేల రూపాయలు పెట్టుబడి పెట్టటానికి స్తోమత లేని వారు నెలకు రూ. 3 వేలు పెట్టుబడి పెట్టి 10 సంవత్సరాలలో 5 లక్షలకు వరకు పొందొచ్చు.