రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఈ బీమా చేయించుకుంటే రూ.10 లక్షల పరిహారం పొందే ఛాన్స్!

ప్రతిరోజూ లక్షల సంఖ్యలో ప్రజలు రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారనే సంగతి తెలిసిందే. అయితే కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం రైలులో ప్రయాణం చేయాలని అనుకునే వాళ్లను టెన్షన్ పెడుతోంది. అయితే రైలు ప్రయాణం చేసేవాళ్లు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు మనం చేసే చిన్నచిన్న తప్పుల వల్ల మన కుటుంబాలు కూడా తీవ్రస్థాయిలో కష్టాలు పడే ఛాన్స్ అయితే ఉంది.

కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో 288 మంది మృతి చెందారు. ప్రస్తుతం రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ప్రమాదంలో మరణించిన వాళ్లకు మరణించిన వ్యక్తుల ఫ్యామిలీల నుంచి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అందనుంది. గాయాలపాలైన వాళ్లకు 2 లక్షల రూపాయలు, స్వల్ప గాయాలపాలైన వాళ్లకు 50,000 రూపాయల సాయం అందనుందని సమాచారం అందుతోంది.

అయితే రైలు ప్రయాణం చేసేవాళ్లు టికెట్లను బుకింగ్ చేసుకునే సమయంలో బీమా కూడా చేయించుకుంటే మంచిదని చెప్పవచ్చు. 35 పైసలతో చేయించుకునే ఈ బీమా వల్ల రైలు ప్రయాణంలో ప్రమాదం జరిగితే పరిహారం పొందే అవకాశం ఉంటుంది. ఈ బీమా తీసుకునే సమయంలో నామినీ వివరాలను సైతం తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది.

ప్రయాణికులు తమ లగేజ్, వస్తువులను పోగొట్టుకున్నా పరిహారం లభిస్తుంది. రైలు ప్రమాదంలో వ్యక్తి మరణిస్తే నామినీ 10 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంటుంది. ప్రయాణికుడు అంగ వైకల్యానికి గురైతే 7.5 లక్షల రూపాయల పరిహారం పొందే ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది. బీమా కంపెనీ కార్యాలయానికి వెళ్లడం ద్వారా బీమాను క్లెయిమ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందని సమాచారం.