ప్రస్తుతం ఉన్న యాంత్రిక జీవితంలో మనం ఏమి తింటున్నాం. అది మన ఆరోగ్యానికి ఎంత వరకు ఉపయోగపడుతుంది అన్నది ఎవ్వరూ ఆలోచించడం లేదు. అంత సమయం కూడా ఉండడం లేదు. అంతేకాక ప్రస్తుతం తినే ఆహారంలో కూడా ఏదీ నాణ్యత అనేది ఉండడం లేదు. పూర్తిగా ఏది తిన్నా కూడా ఏదో ఒక ఇబ్బంది అనేది వస్తుంది. ఈ మధ్య కాలంలో కడుపులో గ్యాస్ ఎక్కువగా పెరిగిపోతుంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి గ్యాస్, అల్సర్ లాంటివి వస్తున్నాయి. ఇక చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేస్తుంటారు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌కి మధ్యలో సరికొత్తగా బ్రంచ్ చేసేస్తుంటారు. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాటుకి స్వస్తి చెప్పాల్సిందేనంటున్నారు ఆహార నిపుణులు. ఉదయాన్నే ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని.. దీని కారణంగా అధికబరువుకి కూడా చెక్ పెట్టొచ్చని.. ఎన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు.
ఉదయాన్నే సరైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల శరీరం, మెదడు ఉత్తేజంగా మారుతుంది. మంచి పోషకాలు నిండిన బ్రేక్‌పాస్ట్ తీసుకోవడం ద్వారా రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ పెరిగడమే కాక.. అధికబరువుని ఈజీగా తగ్గించుకుకోవచ్చు. మనం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో ఖచ్చితంగా ప్రోటీన్స్ ఉండాలి. దీనివల్ల ఎముకలు, కండరాలు బలంగా మారతాయి. బ్రేక్‌ఫాస్ట్‌గా బ్రెడ్ వద్దు.. డిప్రెషన్‌కి గురవుతారట. ఉదయాన్నే అన్ హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం, కాఫీ, పంచదార కలిగిన డ్రింక్స్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్స్‌ని తీసుకోవడం ద్వారా అసిడిటీ వంటి సమస్యలకు కూడా దూరంగా ఉండొచ్చు.
సరైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. అంతేకాదు.. తలనొప్పి, మగతగా అనిపించడం వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ప్రతిరోజు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల స్లిమ్‌గా ఉంటారని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. గుడ్లు, చికెన్, ఓట్‌మీల్, క్యారెట్స్, తాజా ఆకుకూరలు, కూరగాయలు, గ్రీక్ యోగర్ట్, కాటేజ్ చీజ్, డైరీ ప్రొడక్ట్స్, పాలు, అరటిపండ్లు, కివి, నానబెట్టిన చిక్కుళ్లు, సోయా, హెల్దీ నట్స్, గింజలు, అవకాడో, స్మూతీస్, ప్రోటీన్ షేక్స్ ఆరోగ్యాన్ని ఎంతగానో కాపాడతాయి. కానీ చాలా మంది వీటిని రోజువారి ఆహారంలో తీసుకోవడానికి ఇబ్బందులు పడుతుంటారు.