అంధాధున్ బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టుబు ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నటనకుగానూ ఆయుష్మాన్ ఖురానా జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని కోలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. జీన్స్, జోడి చిత్రాల ఫేమ్ ప్రశాంత్ హీరోగా ఈ రీమేక్ రూపొందనుంది. ప్రశాంత్ తండ్రి, సీనియర్ నటుడు, దర్శకుడు త్యాగరాజన్ అంధూధున్
రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు. ఇటీవల రామ్చరణ్ హీరోగా నటించిన వినయవిధేయరామ
చిత్రంలో ప్రశాంత్ చెర్రీ అన్నయ్య పాత్రలో కనిపించారు.