ఇన్సైడ్ టాక్ : “ఆదిపురుష్” తో విజయ్ సినిమా పోటీ..కావాలనే ఫిక్స్ చేసారా.?

పండగ వచ్చింది అంటే చాలు సినిమా ఇండస్ట్రీ దగ్గర భారీ బాక్సాఫీస్ యుద్ధం నడుస్తుంది. అయితే ఈ చిత్రాల్లో అయితే ఇప్పుడు దసరా కానుకగా గాడ్ ఫాదర్, ఘోస్ట్ అనే భారీ చిత్రాలు క్లాష్ కి వస్తున్నాయి. ఇక ఈ క్లాష్ తర్వాత నెక్స్ట్ దీపావళి ఉంది ఆ నెక్స్ట్ అయితే పెద్ద పండగ మళ్ళీ సంక్రాంతి అనే చెప్పాలి.

ఆల్రెడీ సంక్రాంతి గాను మెగాస్టార్, ప్రభాస్, విజయ్ లాంటి స్టార్స్ సినిమాలు ఫిక్స్ అయ్యాయి కానీ వీటిలో అయితే ఇప్పటికి ప్రభాస్ ఆదిపురుష్ రిలీజ్ డేట్ మాత్రమే ఫిక్స్ అయ్యింది. కానీ ఇప్పుడు ఇన్సైడ్ టాక్ ప్రకారం సరిగ్గా ఇదే సినిమా రిలీజ్ డేట్ రోజు విజయ్ నటిస్తున్న వరిసు సినిమా రిలీజ్ డేట్ ని నిర్మాత దిల్ రాజు లాక్ చేసినట్టుగా తెలుస్తుంది.

అయితే ఇది కావాలనే ఫిక్స్ చేసినట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆదిపురుష్ టీజర్ బయటకి వచ్చాక సినిమాలో అనుకున్న రేంజ్ విజువల్స్ కనిపించక తేలిపోయింది. దీనితో ఆడియెన్స్ లో ఉన్న హైప్ చాలా తగ్గిపోగా ఇక దిల్ రాజు అయితే వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు అనుకున్నాడట.

అందుకే విజయ్ సినిమాని అదే డేట్ లో దింపెయ్యాలని ఫిక్స్ చేశారట. ప్రస్తుతానికి అయితే సినీ వర్గాల నుంచి ఈ టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతం ఇస్తున్నాడు అలాగే రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది.