బాక్సాఫీస్ : ఈ టాక్ తో కూడా వరల్డ్ వైడ్ “పొన్నియిన్ సెల్వన్” 2 డేస్ భారీ వసూళ్లు..!

తమిళ సినిమా నుంచి ఎన్నో అంచనాలు పెట్టుకొని రిలీజ్ కి వచ్చిన బిగ్గెస్ట్ చిత్రం “పొన్నియిన్ సెల్వన్”. తమిళ నాట ఒక ప్రైడ్ ప్రాజెక్ట్ గా అందులోని దర్శకుడు మణిరత్నం నుంచి సినిమా ఇది కావడంతో భారీ అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి.

అందుకే మంచి అంచనాలు నడుమే ప్రపంచ వ్యాప్తంగా ఏఈ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే సినిమాకి మాత్రం మొదటి రోజే ఊహించని టాక్ వచ్చింది. దీనితో చాలా మంది తమిళ్ ఆడియెన్స్ బాగా డీలా పడ్డారు కానీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర వస్తున్న వసూళ్లు చూస్తే అసలు దానికి సంబంధమే లేదని చెప్పాలి.

మిక్సిడ్ టాక్ ఈ సినిమాకి ప్రీమియర్స్ తోనే రాగా మొదటి రోజే వరల్డ్ వైడ్ 80 కోట్లకి పైగా గ్రాస్ ని కొల్లగొట్టింది. మరి రెండు రోజుల్లో అయితే ఈ సినిమా ఏకంగా 150 కోట్ల మార్క్ ని అందుకున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఇది తమిళ నాట భారీ రికార్డు కాగా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఓ అరుదైన రికార్డును నెలకొల్పింది. వరుసగా మూడు రోజులు 1 మిలియన్ డాలర్స్ వసూళ్లు అందుకున్న చిత్రంగా పొన్నియిన్ సెల్వన్ చాలా అరుదైన రికార్డును సొంతం చేసుకోగా దీనికి ముందు వరుసలో మన ఆర్ ఆర్ ఆర్ అలాగే బాహుబలి 2 చిత్రాలు ఉన్నాయి.

ఈ లెక్కన అయితే పొన్నియిన్ సెల్వన్ ని తమిళ్ ఆడియెన్స్ మాత్రం మంచి హిట్టే చేసుకున్నారని చెప్పాలి. ఇక ఈ సినిమాలో విక్రమ్ హీరోగా నటించగా కార్తీ కూడా కీలక పాత్రలో కనిపించాడు.