మాసివ్..”సూర్య 42″ కేవలం ఓటిటి హక్కులకి మైండ్ బ్లాకింగ్ ఆఫర్ అట..!

విలక్షణ నటుడు సూర్య హీరోగా, విలన్ గా వీటికి మించి మంచి వ్యక్తిగా కూడా సౌత్ ఇండియా సినిమా దగ్గర చాలా పాపులర్ అని అందరికీ తెలిసిందే. అయితే థియేటర్స్ లో తన మాస్ కం బ్యాక్ ని రీసెంట్ గా రోలెక్స్ అంటూ అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఇక ఇదిలా ఉండగా దానికి ముందే వెట్రిమారన్, బాల లాంటి ఇంటెన్స్ దర్శకులతో సినిమాలు ఓకే చేసిన సూర్య ఆ రెండు సినిమాలకి మించి దర్శకుడు శివతో లాక్ చేసిన సినిమా అనౌన్సమెంట్ తో అంచనాలు సెట్ చేసి వదిలాడు. జస్ట్ అనౌన్సమెంట్ గ్లింప్స్ కి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది అప్పుడు.

మొత్తం 10 భాషల్లో ఈ సినిమాని రిలీజ్ ప్లాన్ చేస్తుండగా 3డి లో కూడా ఈ సినిమాని రెడీ చేస్తున్నారు. ఇక ఇప్పుడు అయితే ఓ భారీ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ సినిమాకి జస్ట్ కేవలం ఓటిటి హక్కులే 100 కోట్లు పలికాయట.

ఎవరు ఈ మొత్తంతో సొంతం చేసుకున్నారో ఇంకా వెల్లడి కాలేదు కానీ 100 కోట్లతో ఓటిటి ఆఫర్ ఈ సినిమాకి ఓకే అయ్యినట్టుగా సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. మరి ఈ చిత్రంలో అయితే బాలీవుడ్ హాట్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.