షాకింగ్ న్యూస్ : హీరో విక్రమ్ కి గుండెపోటు..కానీ అసలు నిజం ఇదే.!

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి వస్తున్న చిత్రాల్లో కోలీవుడ్ భారీ బడ్జెట్ మరియు అవైటెడ్ చిత్రం ”పొన్నియిన్ సెల్వన్” కూడా ఒకటి. దిగ్గజ దర్శకుడు మణిరత్నం ‘చియాన్’ విక్రమ్ తో చేస్తున్న మరో సినిమాలో అందులోని భారీ పీరియాడిక్ కూడా కావడంతో తమిళులు మళ్ళీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర తమిళ సినిమా సత్తా ఏంటో చూపించాలని తహతహలాడుతున్నారు.

అయితే ఈ చిత్రం నుంచి హీరో విక్రమ్ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చెయ్యగా భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఇదే విక్రమ్ పై కొన్ని షాకింగ్ వార్తలు బ్రేకింగ్ గా వైరల్ అవుతున్నాయి. విక్రమ్ కి సడెన్ గా హార్ట్ ఎటాక్ వచ్చింది అంటూ పలు వార్తలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. అయితే దీనిపై అసలు నిజం ఏంటి అనేది ఇప్పుడు తెలుస్తుంది.

తమిళ్ ట్రస్టడ్ వర్గాల నుంచి సమాచారం ప్రకారం అయితే విక్రమ్ కి వచ్చింది ఒక హై ఎండ్ ఫీవర్ మాత్రమే అని అందుకే తాను కాస్త అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు అని ఇప్పుడు ఆ జ్వరం కూడా కాస్త కంట్రోల్ లోకి వచ్చింది అని అందుకే ఎవరు కంగారు పడాల్సిన పని లేదు అని కన్ఫర్మ్ అయ్యింది. విక్రమ్ పై ఆ షాకింగ్ వార్తల్లో అయితే ఎలాంటి నిజం లేదని చెప్పాలి.