పరువు తీసుకుంటున్న మహేష్, విజయ్ ఫ్యాన్స్..కానీ స్టార్ట్ చేసింది ఎవరో తెలుసా!

ఇప్పుడు సౌత్ ఇండియా సినిమా దగ్గర భారీ ఫాలోయింగ్ మార్కెట్ ఉన్న స్టార్ హీరోస్ లో మన టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే తమిళ ఇండస్ట్రీ నుంచి తలపతి విజయ్ కూడా ఒకడు. ఇద్దరు కూడా ఇద్దరే ఏ హీరో సినిమాకి తక్కువ ఓపెనింగ్స్ రావు అలాగే యూట్యూబ్ లో కూడా భారీ రికార్డులు కన్ఫర్మ్.

అయితే ఇప్పుడు అనూహ్యంగా పెద్ద ఎత్తున ఈ ఇద్దరి హీరోల అభిమానులు సోషల్ మీడియాలో దారుణంగా ఒకరి పరువు ఒకరు తీసుకుంటున్నారు. విజయ్ పై మహేష్ ఫ్యాన్స్ మహేష్ పై విజయ్ ఫ్యాన్స్ కొట్టుకుంటూ తమ హీరోలని దారుణంగా దిగజారుస్తూ ఇండియా వైడ్ దరిద్రం చేసి వదులుతున్నారు.

దీనితో ఏకంగా ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ చెత్త ట్రెండ్ ని న్యూస్ గా కవర్ చేస్తున్నాయి అంటే అర్ధం చేసుకోండి ఏ లెవెల్లో చెత్త చేసి పారేశారో అర్ధం చేసుకోవాలి. అయితే సడెన్ గా ఈ ఇద్దరు ఫ్యాన్స్ ఎందుకు కొట్లాడుకుంటున్నారో తెలుసా? అది స్టార్ట్ చేసింది అసలు మహేష్ ఫ్యాన్స్ కాదు అలాగని వేరే ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా కాదు.

ఇది మన తెలుగు మీమ్ పేజెస్ వారు స్టార్ట్ చేసారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి బిజె కి లింక్ పెట్టి సంబంధం లేకుండా ట్రోల్స్ స్టార్ట్ చేస్తే దానికి నెమ్మదిగా మహేష్ ఫ్యాన్స్ నుంచి కూడా రెస్పాన్స్ స్టార్ట్ అయ్యింది. దీనితో తమిళ్ నుంచి విజయ్ ఫ్యాన్స్ కూడా భారీగా ట్రోల్స్ చేస్తూ చాటంత చేసారు. ఇదే దీని వెనక ఉన్న అసలు కథ.