షాకింగ్ న్యూస్, కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ మృతి

కన్నడ సినీరంగ, రాజకీయ రంగ రెబల్‌స్టార్‌, సినీ నటి సుమలత భర్త అంబరీష్‌(66)మరణించారు. ఆయన పూర్తి పేరు మలవల్లి హుచౌ గౌడ అమర్ నాథ్. సినిమా రంగంలోకి వచ్చాక తన పేరును ఆయన అంబరీష్ గా మార్చుకున్నారు. నిన్నసాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బెంగుళూరులోని ఒక ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చేర్చారు. చికిత్స ప్రారంభించిన కొద్ది సేపటికే అంబరీష్‌ మరణించారు. ఆయన నివాళులర్పిస్తూ కర్నాటక ప్రభుత్వం మూడురోజులు సంతాప శెలవులు ప్రకటించింది.

అంబరీష్ కు భార్య, నటి సుమలత, కుమారుడు అభిషేక్‌ ఉన్నారు.కన్నడంలో రాజ్ కుమార్ తర్వాత అంతటి పేరున్న నటుడు అంబరీష్. బేషజాలు ఆయనకు నచ్చవు. మనిషి బోళా. లవ్ తో సహా ఏ విషయాన్ని గోప్యంగా ఉంచుకోవడం ఆయనకు ఇష్టం ఉండదు. గుర్రపు పందాలంటే ఆయన బాగా ఇష్టం. 1972లో ఆయన సినిమాల్లోకి వచ్చారు. ఆయన మొదటి చిత్రం నాగరహావు సూపర్ సన్సేషన్. ప్రఖ్యాత దర్శకుడు ఆయనను పుట్టణ్న కంగల్ సినిమాలకు పరిచయం చేశారు. అంబరీష్ కు శత్రుఘ్న సిన్హాకు పోలికలుంటాయి. సిగరెట్ అలవోక గా గాల్లోఎగరేసి పెదాలకు మీదకు రప్పించే ట్రిక్ తెలిసినవా ళ్లలో అంబరీష్ ఒకరు.

అంబరీష్ మరణ వార్త తెలియగానే ముఖ్యమంత్రి కుమారస్వామి తదితర ప్రముఖులు ఆస్పత్రికి చేరుకుని అంబరీష్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంబరీష్‌ ఆకస్మిక మృతితో ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి  లోనయ్యారు.

ప్రభుత్వంలో ఉన్న అవినీతిని ఎదిరించే వ్యక్తి పాత్ర పోషించినందునే ఆయనకు రెబెల్ స్టార్ అనే పేరు వచ్చింది. ముఖ్యంగా 1981 లో వచ్చిన అర్థ లో ఆయన నిజాయితీ పరుడయిన పోలీసు గా నటించి విశేష ఖ్యాతి పొందారు. తర్వాత పుట్టన్న తీసిన చిత్రం రంగనాయకి  నటుడిగా ఆయన కీర్తిని ఆకాశానికి తీసుకెళ్లింది

ఆయన 1952 మే 29న . మాండ్య జిల్లా మద్దూరు తాలూకాలోని దొడ్డఅరసికెరె లో జన్మించారు. అంబరీష్‌ కన్నడ సినిమాల్లో విలక్షణమైన పాత్రలు పోషించి ఎనలేని పేరు తెచ్చకున్నారు. తర్వాత ఆయన  మూడు సార్లు లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందారు. ఒక సారి రెండేళ్ల పాటు యూపీఏ ప్రభుత్వంలో సమాచారా శాఖ మంత్రి పనిచేశారు. తర్వాత సిద్ధ రామయ్య క్యాబినెట్ లో హౌసింగ్ మంత్రిగా కూడా పని చేశారు.

సినిమాల్లో లాగానే రాజకీయాల్లో కూడా ఆయన రెబెలే.  ఎక్కడ ఇమడలేకపోయారు.  అంబరీష్ వక్కలిగ కులానికి చెందిన వ్యక్తి. 1996 లో ఆయను దేవౌగౌడ్ రాజకీయాల్లోకి లాక్కొచ్చారు. నిజానికి ఆయన అపుడు సినిమారంగంలో తిరుగులేని నటుడి వెలుగొందుతున్నారు. అయితే, దేవౌగౌడ మాట కాదనలేకపోయారు. దేవే గౌడ ప్రధాని కావడంతో రామనగర అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. అపుడు అక్కడ జరిగిన ఉప ఎన్నికలో అంబరీష్ జనతా దళ్ (ఎస్) అభ్యర్థిగా పోటీ చేసి, కాంగ్రెస్ ముఖ్యమంత్రిలింగప్పను ఓడించారు. జనతాదళ్ లో  ఆయన ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. గురువు లాంటి దేవే గౌడ మీద తిరుగు బాటు చేశారు. పార్టీకి రాజీనామా చేశారు. 2007లో కాంగ్రెస్ లోచేరారు.  మూడుసార్లు ఎంపిగా గెలిచారు. మన్మోహన్    సింగ్ మంత్రి వర్గంలో ఆయన సహాయ మంత్రిగా పని చేశారు. కాంగ్రెస్ లో కూడా ఆయన స్థిరంగా లేరు. కావేరీనీటి గొడవలపుడు మాండ్యా రైతులకు  మద్దతుగా ఆయన తన ఎంపి పదవికి రాజీనామా చేశారు. 2016లో ఆయన ను సిద్ధరామయ్య మంత్రివర్గం నుంచి తీసేసినపుడు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు.

ఒక దశలో ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని కూడా అనుకున్నారు. కాని ఆయన పార్టీలోనే ఇమడలేకపోయారు.

 తెలుగు, కన్నడ సహా వివిధ భాషల్లోని చిత్రాల్లో భార్యా భర్తలు కలిసి నటించారు.

(Photo credits Deccan Herald)