క్రేజీ అప్డేట్ : భారీ బ్యానర్ తో నయనతార 75వ సినిమా డీటెయిల్స్ ఇవే.!

దక్షిణాది సినిమా దగ్గర ఉన్నటువంటి ఎందరో స్టార్ హీరోలకి సమానంగా పలువురు హీరోయిన్స్ కూడా తమకి అంటూ సెపరేట్ క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. మరి ఇలాంటి స్టార్ హీరోయిన్స్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ నయనతార కూడా ఒకరు. అయితే నయన్ రీసెంట్ గానే పెళ్లి కూడా చేసుకోగా చాలా మంది ఆమె సినిమాలు ఆపేస్తుంది అనుకున్నారు. 

కానీ వాటికి ధీటుగా తన కెరీర్ లో 75వ సినిమాని ప్రతిష్టాత్మకంగా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా ని ఇప్పుడు భారీ బ్యానర్ వారు అనౌన్స్ చేశారు. మరి ఈ బ్యానర్ ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ వారు కాగా షూటింగ్ కూడా అతి త్వరలోనే స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది. 

మరి ఈ చిత్రాన్ని భారతీయ విశిష్ట దర్శకుడు శంకర్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించనుండగా సత్యరాజ్ తదితరులు నటిస్తున్నట్టు తెలియజేసారు. అయితే ఈ సినిమాపై మరింత డిటైల్స్ త్వరలోనే రానున్నాయి. మరి ఈ అనౌన్సమెంట్ వీడియో చూస్తుంటే ఏదో భారీ సినిమానే అనిపిస్తుంది. మరి ఇది ఏ లెవెల్లో ఉంటుందో చూడాల్సిందే.