తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆమె జీవిత కథను సినిమాగా తీస్తుండగా అందులో కంగనా రనౌత్ నటిస్తోంది. ఈ చిత్రం ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా, గౌతమ్ మీనన్ తానూ జయలలిత జీవితం ఆధారంగా వెబ్ సిరీస్ చేస్తున్నట్టు అందులో జయలలిత పాత్ర రమ్య కృష్ణ చేస్తున్నట్టు ప్రకటించారు.
అయితే జయలలిత మేనల్లుడు దీపక్ కుమార్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ‘జయలలిత కథ సినిమాగా తీయడానికి దర్శకుడు ఏఎల్ విజయ్ మాత్రమే తమ దగ్గర అనుమతి తీసుకున్నారని, దర్శకుడు గౌతమ్ మీనన్ తమ అనుమతి లేకుండా జయలలిత జీవితం ఆధారంగా ఎం తీసిన అందుకు తగ్గ న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు’.
ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కొంత చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఏవో లొసుగులు లేకుండా ఇందులోకి దిగుతారా? అందువల్ల మీనన్ తన చిత్రీకరణతో ముందుకు వెళ్తాడని అంటున్నారు అతని సన్నిహితులు. ఏది ఏమైనా రమ్య కృష్ణ నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూద్దాం.