Heroine Deepshikha Chandran: మార్క్‌ సినిమాలో నా నటనకు వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది: హీరోయిన్ దీప్శిఖ చంద్రన్‌

Heroine Deepshikha Chandran: బ్లాక్ బస్టర్ మార్క్‌ సినిమాలో హీరోయిన్ గా అలరించిన దీప్శిఖ చంద్రన్‌ టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. అద్భుతమైన నటన, ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకున్న దీప్శిఖా అందరికీ ఫేవరేట్ గా నిలిచింది. తాజాగా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకుంది.

‘మార్క్’ సినిమాలో మీ నటనకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. కెరీర్ ఆరంభంలోనే మాస్ హీరోయిన్‌గా గుర్తింపు రావడం ఎలా అనిపిస్తోంది ?

-నిజంగా చాలా గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నాను. మార్క్ నుంచి వచ్చిన రెస్పాన్స్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. మాస్ హీరోయిన్ అనే ట్యాగ్ ప్రెషర్‌గా కాకుండా ఒక ఆశీర్వాదంలా అనిపిస్తోంది. ఆడియన్స్ నన్ను స్ట్రాంగ్ క్యారెక్టర్స్‌లో అంగీకరించడం నా కెరీర్‌లో చాలా పెద్ద విజయం. నన్ను ఛాలెంజ్ చేసే పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళ్లాలనుకుంటున్నాను.

కిచ్చా సుదీప్ గారితో సినిమా అంటే పెద్ద అవకాశం. ఆయనతో పని చేయడం ఎలా అనిపించింది?

-అది నిజంగా గౌరవం భావిస్తున్నాను. కిచ్చా సుదీప్ గారితో పని చేయడం ఒక లెర్నింగ్ స్కూల్ లాంటిది. ఆయన డిసిప్లిన్, ఫోకస్, కో-ఆర్టిస్ట్స్‌కి ఇచ్చే గౌరవం అద్భుతం. సెట్లో ఆయన ప్రెజెన్స్ చాలా మోటివేటింగ్‌గా ఉంటుంది. అంత పెద్ద స్టార్ అయిన అందరిరతో కలివిడిగా వుంటారు. నటన విషయంలో చాలా ప్రోత్సహిస్తారు.

మీరు చెన్నై బ్యాక్‌గ్రౌండ్ అయినా, తమిళ్, కన్నడ, తెలుగు సినిమాల్లో చేస్తున్నారు. భాషల విషయంలో ఇబ్బంది అనిపించలేదా?

-ఆరంభంలో కొంచెం ఛాలెంజ్ అనిపించింది. కానీ భాష అనేది ఒక మీడియం మాత్రమే, ఎమోషన్ యూనివర్సల్. వినడం, నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాను. తమిళ్, తెలుగు, కన్నడ – అన్ని ఇండస్ట్రీలు నాకు ఎంతో ఆత్మీయంగా స్వాగతం పలికాయి. ఆ సపోర్ట్ వల్లే ఈ జర్నీ మరింత అందంగా మారింది.

‘మఝవిల్ (మోర్గన్)’ సినిమాలో విజయ్ ఆంటోనీ గారితో పని చేశారు. ఆయన ఇచ్చిన బెస్ట్ అడ్వైస్ ఏంటి?

-విజయ్ ఆంటోనీ గారు చెప్పిన బెస్ట్ అడ్వైస్ – “Accept things as they are.” ఆయన చాలా శాంతంగా, కామ్‌గా ఉండే వ్యక్తి. ఆ క్వాలిటీనే ఆయన నుంచి నేర్చుకున్నాను.

GRC జ్యువెలర్స్ కమర్షియల్‌లో సీనియర్ తమిళ నటులతో స్క్రీన్ షేర్ చేశారు. ఆ యాడ్స్ తర్వాత అవకాశాలు వచ్చాయా?

-అవును, ఆ యాడ్స్ తర్వాత కాల్స్ వచ్చాయి. కమర్షియల్స్ మంచి విజిబిలిటీ ఇస్తాయి, అది కెరీర్‌కు హెల్ప్ అవుతుంది.

సూర్య వశిష్ట్‌తో ‘రమణి కళ్యాణం’ సినిమా రెడీగా ఉంది. ఇందులో మీ పాత్ర ఎంత యూనిక్?

-రమణి కళ్యాణంలో నా క్యారెక్టర్ చాలా లేయర్డ్‌గా ఉంటుంది. ఎమోషనల్‌గా స్ట్రాంగ్. సూర్య వశిష్ట్‌తో కెమిస్ట్రీ చాలా న్యాచురల్‌గా, రియలిస్టిక్‌గా ఉంటుంది.

తెలుగు ప్రమోషన్స్‌లో మీరు తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్యూచర్‌లో సెల్ఫ్ డబ్బింగ్ ప్లాన్ ఉందా?

-ఖచ్చితంగా ఉంది. తెలుగు డిక్షన్ మీద యాక్టివ్‌గా వర్క్ చేస్తున్నాను. సెల్ఫ్ డబ్బింగ్ చేస్తే క్యారెక్టర్‌కి మరింత నిజాయితీ వస్తుంది. ఫ్యూచర్ తెలుగు ప్రాజెక్ట్స్‌లో డబ్బింగ్ చేయాలనే లక్ష్యంతో ప్రాక్టీస్ చేస్తున్నాను.

మోడలింగ్ నుంచి సినిమాల్లోకి రావడం చిన్నప్పటి కలేనా, లేక బై ఛాన్స్ జరిగిందా?

-నటన చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉంది. మోడలింగ్ ఒక స్టెప్పింగ్ స్టోన్ మాత్రమే, కానీ ఫైనల్ గోల్ మాత్రం సినిమా. ఇక్కడ నిలబడాలంటే ప్యాషన్, హార్డ్ వర్క్ తప్పనిసరి.

గ్లామరస్ రోల్స్ కాకుండా యాక్షన్ హెవీ పాత్రలు చేయడానికి ప్రేరణ ఎవరు?

-ఆన్ స్క్రీన్‌లోనూ, ఆఫ్ స్క్రీన్‌లోనూ స్ట్రాంగ్ ఉమెన్ నాకు ఇన్స్పిరేషన్. అలాంటి క్యారెక్టర్స్ నాకు చాలా ఎగ్జైట్‌మెంట్ ఇస్తాయి. స్ట్రాంగ్ అంటే రఫ్‌గా ఉండాల్సిన అవసరం లేదు – అది పవర్‌ఫుల్‌గా, గ్రేస్‌ఫుల్‌గా కూడా ఉండొచ్చు అని నేను నమ్ముతాను.

టాలీవుడ్‌లో ఎంట్రీ తర్వాత, తదుపరి ఎవరితో పని చేయాలని అనుకుంటున్నారు?

-టాలీవుడ్‌లో చాలా టాలెంటెడ్ హీరోలు ఉన్నారు. నా ప్రాధాన్యం ఎప్పుడూ స్ట్రాంగ్, పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్స్‌కి. అవకాశం వస్తే అల్లు అర్జున్ గారితో పని చేయాలని వుంది.

సరైన కథల కోసం ఎదురు చూస్తున్నాను.

బాబు లండన్ సీక్రెట్ || Chalasani Srinivas Full Clarity On Chandrababu Lokesh London Trip Secret ||TR