జగన్ పై హత్యాయత్నం, అమెరికాలో నిరసన!

వైఎస్ ఆర్ సిపి (యుఎస్ ఎ ఎన్ ఆర్ ఐ) బే ఏరియా విభాగం ఆధ్వర్యంలో, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్ పై జరిగిన హత్యాయత్నం పట్ల జగన్ అభిమానులు, పలువురు తెలుగు ప్రవాసాంధ్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాలిఫోర్నియా , బే ఏరియా లోని ఫ్రీమాంట్ లో జరిగిన ఒక సమావేశంలో వారు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.

కన్వీనర్ శ్రీమతి మధులిక మాట్లాడుతూ జరిగిన సంఘటనమీద ఏమి జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా, కనీసం ప్రాధమిక విచారణ కూడా చేయకుండా నిందితుడు జగన్ గారి అభిమాని అని, పలానా కులం అని హడావిడిగా ప్రకటించడం పట్ల ఆశ్చర్యం వక్తం చేశారు. అసలు సూత్రదారులను కనుగొనే దిశగా విచారణ జరగుతుందనే విశ్వాసం లేకుండా పోతున్నది, దీనికి గతంలో రాష్టంలో జరిగిన, “పుష్కరాల మరణాలు” , “కాల్ మని”, “రైల్ దహనం” , “రాజధాని భూములు దగ్ధం” వంటి అనేక సంఘటనలు సాక్ష్యమని వారు అబిప్రాయపడ్డారు. ఇపుడున్న వాతావారణంలో నిస్పాక్షింగా “కేంద్ర దర్యాప్తు సంస్థలతో” విచారణ చేయించడమే మార్గమని వారు డిమాండు చేశారు.

కన్వీనర్ చంద్రహాస్ మాట్లాడుతూ దాడిని ఖండించకుండా, ఖండించిన వారిపై విమర్శలు చేయడం ద్వారా )ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి (చంద్రబాబు) తనలోన రాక్షతత్వాన్ని మరోసారి భయటపెట్టుకున్నారని విమర్శించారు.

వైస్సార్సీపీ గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ కే వి రెడ్డి మాట్లాడుతూ హత్యాయత్నానికి వాడిన ఆయుధాన్ని ఎయిర్పోర్ట్ కాంటీన్ లోనికి తీసుకోని రావడానికి ఎవరు సహకరించారో పూర్తి స్థాయి విచారణ చేయించాలని డిమాండు చేసారు. హత్యాయత్నం వెనుక ఉన్న అసలు కుట్ర దారులు ఎవరో బయట పెట్టాలన్నారు.అలాగే మానవతా దృక్పధం తో పరామర్శించిన వారిపైన రాజకీయ బురద చల్లడం ముఖ్యమంత్రి హోదాకి సరికాదన్నారు.

వైస్సార్సీపీ ముఖ్య సభ్యుడు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పై హత్యాయత్నం జరిగితే ఎవరూ పరామర్శించకూడదన్నట్లు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారని, ఇది ఆయన కుసంస్కారానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. మానవతా కోణంలో చూడాల్సిన విషయం పట్ల వారు చూపిన ధోరణిని , తెలుగు వారు అందరూ అసహ్యించుకుంటున్నారని అన్నారు.

ముఖ్యమంత్రి గ్రామస్థాయి నేత లాగా చౌకబారు పదాలు “వాడు” “వీడు” అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ని సంబోధించడం ముఖ్య మంత్రి కుసంసృతి కి నిదర్శనం అని , హత్యారాజకీయాలు “తెలుగు దేశం” ప్రభుత్వం లో పెరిగి పోతున్నాయనన్నారు.

మరో ముఖ్య సభ్యుడు విజయ్ ఎద్దుల మాట్లాడుతూ ఈ ఘటన చాల దురదృష్టకరం అని వర్ణించారు. యావత్ ఆంధ్రప్రదేశ్ దీనికి బాధ పడుతుంటే చంద్రబాబు మాత్రం ఇది డ్రామా లాగ కనిపిస్తున్నదని , ఆయన 40 ఏళ్ళ అనుభవం నుంచి నేర్చుకున్నది శూన్యమని అన్నారు.

“ఇలాంటి ఘటన ఎవరికీ జరిగినా అది శోచనీయం. ఖండించాల్సిందే. వైస్ జగన్ గారికి వస్తున్న విశేష స్పందన చూసి తెలుగు దేశం వారికి వచ్చే ఎన్నికల లో వోడి పోతామని అభద్రతా భావం పెరిగి ఇలాంటి హత్యాయత్నానికి పాలుపడుతున్నారు. ఇది గర్హనీయం,’’అని మరో ముఖ్య సభ్యుడు శ్రీధర్ తోటరెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో వైసిపి ఎన్ ఆర్ ఐ సభ్యులు నరేష్ కొండూరు , అమర్ , ప్రవీణ్ , సురేంద్ర అబ్బవరం, సుగుణ,వీర రెడ్డి సురవరం, నరేంద్ర అట్టునూరి ,శ్రీని కొండా ,రవి గాలి , వైసిపి స్టూడెంట్ విభాగం నాయకులు పాల్గొన్నారు