ప్రేమాన్మాది భరత్ చేతిలో గాయపడ్డ ఇంటర్ అమ్మాయి మధులిక ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. బుధవారం బర్కత్ పురలో ప్రేమించలేదని మధులిక పై భరత్ కొబ్బరి బోండాల కత్తితో దాడి చేశాడు. దాంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. మలక్ పేట యశోద ఆస్పత్రిలో మధులికకు చికిత్స అందిస్తున్నారు.
మధులిక మెదడు వరకు గాయాలు కావడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. 5 బృందాలుగా ఏర్పడిన డాక్టర్లు ఆమెకు చికిత్స చేశారు. ప్రస్తుతం 5 ప్లాస్టిక్ సర్జరీలు చేశారు. దాంతో మధులిక పరిస్థితి కాస్త మెరుగుపడింది. ప్రస్తుతం అందరిని చూస్తూ చిన్నగా మాట్లాడగలుగుతోంది. ఇన్ఫెక్షన్లు సోకకుండా మరో రెండు రోజులు ఐసీయూలోనే ఉంచుతామని డాక్టర్లు అన్నారు. రెండు రోజుల తర్వాత జనరల్ వార్డుకు షిఫ్టు చేస్తామని డాక్టర్లు తెలిపారు.