పోలీసుల కంట‌ప‌డ‌కుండా పేడ‌లో దాక్కున్న దొంగ‌, త‌ర్వాత ఏం జ‌రిగిందంటే….?

కొన్ని స‌న్నివేశాలు చాలా ఫన్నీగా అనిపిస్తుంటాయి. అవి కావాల‌ని చేస్తారో లేదంటే స‌మ‌యానుసారం అలా జ‌రుగుతుందో తెలియ‌దు కాని కామెడీగా ఉంటాయి. తాజాగా ఇంగ్లాండ్‌లోని ససెక్స్ కౌంటీలో జ‌రిగిన సంఘ‌ట‌న విన‌గానే అంద‌రు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతున్నారు. పోలీసుల‌ని త‌ప్పించుకునేందుకు ఆ దొంగ‌కి స్థ‌లం ఎక్క‌డా దొర‌క‌లేద‌న్న‌ట్టు పోయి పేడ‌లో దాక్కున్నారు. అయిన‌ప్ప‌టికీ అత‌డిని గుర్తించిన పోలీసులు దొంగ‌ని ప‌ట్టుకొని అత‌డి శ‌రీరాన్ని క్లీన్ చేయ‌కుండానే బేడీలు వేశారు. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్‌గా మారింది.

వివ‌రాల‌లోకి వెళితే ససెక్స్ కౌంటీలో కారు దొంగ‌త‌నం జ‌రిగింది. విష‌యం తెలుసుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థలానికి చేర‌కొని దొంగ‌ని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. త‌న‌ని పోలీసులు వెంబ‌డిస్తున్నార‌ని తెలుసుకున్న దొంగ వారి కంట ప‌డ‌కుండా ఉండేంద‌కు పేడ ఉన్న గోతిలో దాక్కున్నాడు. దాదాపు ఆరు అడుగుల పైనే ఆ గోయి ఉండ‌గా, అందులో దూకగానే మ‌నోడు ఊబిలోకి పోయిన‌ట్టు మునిగిపొయాడు. ఊపిరాడ‌కుండా ఇబ్బందులు ప‌డుతున్న అతడిని గుర్తించిన పోలీసులు అత‌డిని గొయ్యి నుండి బ‌య‌ట‌కు తీసి బేడీలు వేశారు.

ఎక్క‌డ పారిపోతాడో అనుకున్నాడో ఏమో క‌ని క‌నీసం పేడ‌ని క్లీన్ చేయ‌కుండానే అత‌డికి బేడీలు వేశారు. ప్ర‌స్తుతం ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది. దొంగ చాలా చాలుగాడు అయ్యి ఉంటాడు. అందుక‌నే ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా బేడీలు వేశార‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. మ‌రోవైపు దొంగ ప్రాణాలు స‌మాధిలో క‌లిసి పోకుండా కాపాడిన పోలీసుల‌ని ప్ర‌శంసిస్తున్నారు. అయితే ఇలాంటి ఫ‌న్నీ సంఘ‌ట‌న‌లు నిత్యం ఎన్నో జ‌రుగుతున్న‌ప్ప‌టికీ, దొంగ పోయి పోయి పేడ‌లో దాక్కోవ‌డం అంద‌రికి న‌వ్వు తెప్పిస్తుంది.