రేవంత్ రెడ్డి ఓ దొంగ అంటూ అది రచ్చబండ కాదు లుచ్చాబండ అని ఘాటు వ్యాఖ్యలు చేసిన మల్లారెడ్డి..

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తాజాగా రేవంత్ పై మండి పడ్డాడు. కాంగ్రెస్ దివాళా తీసిన దరిద్రపు పార్టీ అని.. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్ అవుతుంది అని అన్నాడు. కాంగ్రెస్ లోని భట్టి, ఉత్తమ్, జగ్గారెడ్డి అమాయకులని కానీ రేవంత్ మాత్రం లుచ్చా పనులు చేస్తున్నాడు అంటూ.. పదే పదే కేసీఆర్ ను, కేటీఆర్ ను తిడుతున్నాడని అన్నాడు.

ఆయన చేసేది రచ్చబండ కాదు అని.. లుచ్చా బండ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పెళ్లి పెటాకులు లేకుండా నైట్ క్లబ్ లలో తిరిగే రాహుల్ గాంధీ ఒక తోపు అని.. ఈ పీసీసీ చీఫ్ మరో తోపు అని దారుణంగా విమర్శించాడు. అప్పుడే సీఎం అయినట్లుగా మాట్లాడుతున్నాడు అంటూ.. సీఎం కాదు గా కనీసం అటెండర్ కూడా కాదని అన్నాడు.