పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ఎన్నిక

పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పిటిఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానిగా ఎన్నియ్యారు.  ఈ రోజు పార్లమెంటు (నేషనల్ అసెంబ్లీ) లో జరిగిన ఎన్నికలో ఆయనకు  176  ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థి పిఎంఎల్ -ఎన్ నేత షాబాజ్ షరీఫ్ కు 96 ఓట్లు పోలయ్యాయి. ఇమ్రాన్ ఎన్నికయినట్లు స్పీకర్ అసద్ ఖైజర్ ప్రకటించగానే సభలో గందరగోళం ఏర్పడింది. ప్రతిపక్ష సభ్యుడు ‘న మంజూర్ ’ (అమోదయోగ్యం కాదు), ‘వజీరే ఆజమ్ నవాజ్ షరీఫ్ – నినాదాలతో సభ దద్ధరిల్లింది.  ఇమ్రాన్ మాత్రం సభలో చిరునవ్వులు చిందిస్తూ సొంత పార్టీ సభ్యులతో కరచాలనం చేస్తూ కూర్చుండి పోయారు.

ఇమ్రాన్ రేపు ప్రధానిగా ప్రమాణం చేస్తారు.

ఇది ఇలా ఉంటే,  ఇమ్రాన్ పదవీ స్వీకరోత్సవానికి భారతీయ క్రికెటర్లు చాలా మంది వెళ్తున్నారు. నవజో త్ సిధ్దూ ఈ రోజు వాఘా సరిహద్దు నుంచి పాకిస్తాన్ లోకి ప్రవేశించారు.  ఆక్కడ ఆయన ఘన స్వాగతం లభించింది. సిద్ధూ ఇమ్రాన్ కు ఒక కాశ్మీరి శాలువ బహూకరిస్తున్నారు.

ఇటీవల ఎన్నికల్లో ‘నయా పాకిస్తాన్ ’నినాదంతోొ ఇమ్రాన్ పోటీచేసి అత్యధిక సీట్లను సంపాదించారు.