ఈ వయస్సులో ఈ రేంజిలో అందాల ప్రదర్శనలేంటి? ఫ్యాన్స్ షాక్

కొందరు వయస్సుకు అతీతంగా ఉంటారు. వయస్సు పెరుగుతూంటే అందం తగ్గాల్సింది పోయి ఇనుమడిస్తూంటుంది. అందంపై, ఆరోగ్యంపై తీసుకునే శ్రద్ద, వాళ్ల జీన్స్ అందుకు తోర్పడతాయి. అలాంటివారిలో ప్రముఖ పాప్ స్టార్ జెన్నీఫర్ లోపెజ్ ఒకరు. ఇప్పుడు ఆమె వయస్సు 49 . అయితేనేం పాతికేళ్ల కుర్రపిల్లలా ఫోజులు కొడుతూ ఇదిగో ఇలా ఫోటో షూట్ కు సిద్దపడింది. తన ఈ ఫోటో షూట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హాట్ పుట్టిస్తోంది.

‘ఇన్‌స్టైల్’ అనే మ్యాగజైన్‌ కవర్ పేజీ కోసం చేసిన ఫొటో షూట్ ఇది. ఈ ఫోటో చూస్తే..ఏంటీ అందం అనకుండా ఉండబోలేకపోతున్నారు. అసలు ఈ వయస్సులో ఇందతం ఎలా హౌ..అని ఆశ్చర్యపోతున్నారు. దానికి తోడు ఈ ఫొటో షూట్ కోసం ఆమె ధరించిన కాస్ట్యూమ్స్ . ఈ కాస్ట్యూమ్స్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఇక ఈ ఫోటో షూట్‌కు సంబంధించిన పిక్స్‌ను జెన్నీఫర్ తన ట్వీట్టర్‌లో వరుసగా షేర్ చేసి కుర్రకారులో అలజడి రేపింది. జెన్నిఫర్ అంత వయసు ఉన్నట్లు కనిపించడం లేదని, అమాంతం ఓ ఇరవై ఏళ్లు తగ్గిపోయిందని, ఇంకా యంగ్ లుక్‌లో మెరిసిపోతున్నారంటూ ఆమె అభిమానులు మురిసిపోతున్నారు. రీ ట్వీట్ చేయడంతో పాటు, జెన్నీఫర్ ఫోటోలకు వరసపెట్టి లైకులు కొడుతున్నారు. మీరేమంటారు ఈ ఫొటోలు చూసి.