ఈ రోజుల్లో ఏదైన సెలబ్రేషన్ జరుగుతుంది అంటే అక్కడ కేక్ కటింగ్ తప్పనిసరి. అయితే సర్కిల్‌ని బట్టి కేక్ క్వాలిటీలో పలు మార్పులు ఉంటాయి. కొందరు చాక్లెట్ కేక్ అని, మరి కొందరు పైన్ యాపిల్ కేక్ అని ఇంకొందరు వెరైటీ ఫ్లేవర్స్‌తో కేక్ తయారు చేయించుకొని తీసుకెళుతుంటారు. అయితే సెలబ్రేషన్స్ పూర్తయ్యాక కేక్‌ని కట్ చేసి అందరికి పంచే క్రమంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకేనేమో ఓ నెటిజన్ తన మేధాసంపత్తికి కాస్త పదును పెట్టి కేక్‌ని ఎలా కట్ చేయాలి, ఎలా సర్వ్ చేయాలనేది చూపించాడు.
వైన్ గ్లాస్‌లతో కేక్ కటింగ్‌కి సంబంధించిన వీడియోని అమెరికన్ ఫిలిం మేకర్ నాన్సీ మియర్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోలో వైన్ గ్లాసులతోనే కేక్ కట్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో 118కె వ్యూస్ సంపాదించింది. అయితే వైన్ గ్లాసులతో కేక్‌ని ఎలా కట్ చేయాలంటే పైన భాగాన్ని కేక్‌లోకి ముంచి జస్ట్ స్వైప్ చేస్తే ఆ గ్లాసులోకి కేక్ అవలీలగా వస్తుంది. ఈ ఆలోచన ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది
ఈ వీడియోపై ప్రశంసల వర్షం కురుస్తుండగా, ఓ నెటిజన్ బర్త్‌డే కేక్ కటింగ్‌లో నేను చూసిన ఉత్తమ నైపుణ్యం ఇదే అని కామెంట్ పెట్టాడు. కరోనా వైరస్ టైంలో ఇలాంటి ఆలోచన అత్యుత్తమం అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైన కేక్‌ని కట్ చేసేందుకు ఇంతటి ఉత్తమ ఆలోచన వచ్చిన ఆ వ్యక్తికి సలామ్ కొట్టాల్సిందేనని నెటిజన్స్ పొగడ్తలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోని మీరు చూసి ఎంజాయ్ చేయండి.