అందాల ఆరబోస్తూ డ్యాన్స్ చేసిన గ్లామ‌ర్ బ్యూటీ.. డైమండ్ రింగ్ జారిప‌డ‌డంతో షాక్!

హేట్ స్టోరీ, స‌న‌మ్ రే వంటి చిత్రాలతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన ఉత్త‌రాది భామ ఊర్వశి రౌతేలా. కెరీర్‌లో సెటిల్ అయ్యేందుకు ఎంతో త‌పన ప‌డుతున్న ఈ అందాల భామ ఎద అందాల‌ను ఆర‌బోస్తూ యూత్ దృష్టిని ఎక్కువ‌గా ఆక‌ర్షిస్తూ ఉంటుంది. ట్విట‌ర్‌, ఇన్ స్టాగ్రామ్ ఖాతాల్లో ఊర్వ‌శి హాట్ ఫొటోల‌కు విప‌రీత‌మైన లైక్స్ వ‌స్తుంటాయి. ఇటీవ‌ల బ్లాక్ రోజ్ అనే చిత్రంలో ఊర్వ‌శి న‌టించ‌గా ,ఈ చిత్రాన్ని మోహన్‌ భరద్వాజ్ తెర‌కెక్కించారు. సంపత్‌నంది రచించారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రానుంది.

అయితే సినిమాల‌తో పెద్ద‌గా గుర్తింపు తెచ్చుకోలేక‌పోతున్న ఊర్వ‌శి హాట్ హాట్ ఫొటో షూట్స్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది. తాజాగా బోల్డ్ ఫోటోలతో యువ‌త‌కు పిచ్చెక్కించే ప్ర‌య‌త్నం చేసింది. ఇందులో భాగంగా ఖ‌రీదైన డ్రెస్‌తో పాటు విలువైన ఆభ‌ర‌ణాలు ధ‌రించిన ఊర్వ‌శి త‌న‌దైన స్టైల్‌లో స్టెప్పులు వేసింది. అయితే డ్యాన్స్ చేస్తున్న స‌మ‌యంలో అనుకోకుండా ఆమె చేతికి ధరించిన డైమండ్ రింగ్, బ్రాస్‌లెట్ కిందపడిపోయాయి. దీంతో ఉలిక్కి ప‌‌డ్డ ఆమె వెంట‌నే వాటిని తీసుకొని త‌న చేతికి అలంక‌రించుకుంది.

అయితే ఈ వీడియోల‌ను ఊర్వ‌శి త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఊర్శ‌శి.. ఖ‌రీదైన వ‌స్తువులు నేల మీద ప‌డితే ఆ బాధ ఎలా ఉంటుద‌నేది అమ్మాయిల‌కు మాత్ర‌మే తెలుసంటూ కామెంట్ పెట్టింది. ప్ర‌స్తుతం ఊర్శశి పోస్ట్ చేసిన వీడియోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. కాగా, ఊర్వ‌శి రౌతేలా తెలుగులోను పాతుకుపోవాల‌ని చాలా కృషి చేస్తుంది.