రామ్ చేతిలో ఉన్న ఆ వ‌స్తువేంటో గుర్తు ప‌ట్టారా..!

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ స్టైల్, డ్యాన్సింగ్‌కు ప్రేక్షకులు ఎంత మంత్ర‌ముగ్దుల‌వుతారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నిర్మాత “స్రవంతి” రవికిషోర్ తమ్ముడైన మురళి పోతినేని కొడుకు రామ్ కాగా, హైదరాబాదులో పుట్టిన అత‌ను తన విద్యాభ్యాసం తమిళనాడులో చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమం, సెంట్ జాన్ పాఠశాలలో చేసాడు. దేవ‌దాసు చిత్రంతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చాడు. వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అలరిస్తూ వ‌చ్చిన రామ్ రీసెంట్‌గా ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో భారీ హిట్ కొట్టాడు. ఇందులో రామ్ న‌ట‌న‌కు, డ్యాన్స్‌కు అభిమానులు ఫుల్ ఫిదా అయ్యారు.

ప్ర‌తి సినిమాకు త‌న మేకొవ‌ర్‌ని మార్చుకుంటూ వ‌స్తున్న రామ్ జిమ్‌లో గంట‌ల త‌ర‌బ‌డి వ‌ర్కవుట్స్ చేస్తున్న విష‌యం తెలిసిందే. అప్పుడ‌ప్పుడు త‌న లుక్‌కి సంబంధించి సోష‌ల్ మీడియాలో వెరైటీ ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని థ్రిల్ చేస్తుంటాడు. అయితే తాజాగా రామ్ జిమ్ టూల్ ఒక‌టి చేతిలో ప‌ట్టుకొని వెళ్ళ‌డం కెమెరాకు చిక్కింది. వైట్ షార్ట్‌, టీషర్ట్ వేసుకున్న రామ్ జిమ్ టూల్ ను ప‌ట్టుకుని బ‌య‌ట‌కు వ‌స్తుండగా తీసిన వీడియో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

రామ్ చేతిలో ప‌ట్టుకున్న జిమ్ టూల్ ఏంట‌నే దానిపై అభిమానుల‌లో ఆస‌క్తి నెల‌కొంది. అది మ‌రేదో కాదు. 9-1 బాడీ బిల్డింగ్ పుష్ అప్ ర్యాక్ బోర్డు. ఈ జిమ్ టూల్‌ శ‌రీరానికి సంపూర్ణ‌మైన వ్యాయామాన్ని ఇవ్వ‌డ‌మే కాకుండా ప‌ర్‌ఫెక్ట్ వ‌ర్క‌వుట్స్ చేసుకునే వెసులుబాటు క‌ల్పిస్తుంది. దీనిని త‌న వెంట తీసుకెళుతూ ఖాళీ స‌మ‌యంలో దీనిపై వ‌ర్కవుట్స్ చేస్తుంటాడు రామ్. ప్ర‌స్తుతం కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రెడ్ అనే సినిమా చేస్తుండ‌గా, దీనిక సంబంధించి తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో రామ్ డిఫ‌రెంట్ వేరియేష‌న్స్ చూపిస్తూ అబ్బుర‌ప‌రిచాడు. వ‌చ్చే ఏడాది చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.