కరోనా.. కరోనా.. కరోనా.. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు. దీని గురించి చిన్న పిల్లలను అడిగినా చెబుతారు. పండు ముసలిని అడిగినా చెబుతారు. కరోనా వైరస్ అంతలా ప్రజల జీవితాల్లోకి ప్రవేశించింది మరి.
కరోనా వల్ల ప్రపంచమంతా అతలాకుతలం అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఎక్కడో చైనాలో పుట్టిన ఈ వైరస్ మనదాకా వస్తుందా? అని అంతా అనుకున్నారు. కానీ.. మనం చూస్తుండగానే మనదాకా వచ్చింది. మనకి అంటుకుంది. ప్రస్తుతం భారతదేశం కూడా కరోనాతో పోరాడుతోంది. లక్షల మందికి కరోనా వైరస్ సోకుతోంది.
ఇప్పటికే పలు దేశాల కంపెనీలు కరోనా వ్యాక్సిన్ ను తయారు చేశామంటూ చెప్పుకుంటున్నాయి. కొన్ని ఇంకా క్లీనికల్ ట్రయల్స్ దశలోనే ఉన్నాయి. పూర్తిస్థాయి కరోనా వాక్సిన్ మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా రాలేదు.
అయితే.. ఎవ్వరికీ తెలియని ఓ నిజం ఏంటంటే.. కరోనాకు చైనా వాక్సిన్ ను ఎప్పుడో కనిపెట్టేసిందట. చైనా కరోనా వాక్సిన్ ను జులై 22నే అందుబాటులోకి తీసుకొచ్చిందట. ఈ వార్త విని ఇప్పుడు ప్రపంచ దేశాలు విస్తుపోతున్నాయి.
అమ్మ చైనా… నువ్వు మామూలు దేశానివి కావు. నీ దేశంలో పుట్టిన వైరస్ ను ప్రపంచ దేశాలకు అంటించి.. నువ్వు వాక్సిన్ తయారు చేసుకొని ప్రపంచ దేశాలకు తెలియకుండా మీ దేశంలోనే దాన్ని వాడుకుంటున్నారా? అంటూ ప్రపంచ దేశాలు చైనా మీద ఫైర్ అవుతున్నాయి.
చైనాలో కరోనా వాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని.. కరోనా వ్యాక్సిన్ బృందం సభ్యుడు జెంగ్ జోంగ్ వీ తెలిపారు. అది అందుబాటులోకి రావడం మాత్రమే కాదు.. దాన్ని ఇప్పటికే వేల మందికి ఇచ్చాం.. అని కూడా ఆయన షాకింగ్ విషయం తెలిపారు.
అయితే.. ఈ వాక్సిన్ ను అందరికీ ఇవ్వడం లేదని.. కరోనా రిస్క్ ఎక్కువగా ఉన్న వాళ్లకే ఈ వాక్సిన్ ను ఇస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం కూడా కరోనా రిస్క్ ఎక్కువ ఉన్నవాళ్లకే వాక్సిన్ ఇవ్వాలని అనుమతి ఇచ్చినట్టు ఆయన తెలిపారు.
అందుకే… అత్యవసర విభాగాల్లో పనిచేసే వాళ్లకు మాత్రమే ఈ వాక్సిన్ ను ఇస్తున్నారట. అయితే.. ఇంకా ఈ టీకాకు క్లీనికల్ ట్రయల్స్ చేస్తున్నప్పటికీ.. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో కరోనా రిస్క్ ఎక్కువ ఉన్నవాళ్లకు ఈ టీకాను ఇచ్చేందుకు చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందట.