విజువ‌ల్ క‌న్‌ఫ్యూజ‌న్‌!

లారీ వెళ్లి ఆటోను గుద్దినా, ఆటో వెళ్లి లారీని గుద్దినా ఆటోకే న‌ష్టం అనేది రొటీన్ క‌దా! ఈ ఘ‌ట‌న మాత్రం రొటీన్‌కి భిన్నంగా అన్న‌ట్టు ఉంది. న‌డిరోడ్డు మీద సైకిల్‌ను గుద్దిన కారు బంప‌ర్‌తో స‌హా డ్యామేజీకి గురైంది. కారు బంప‌రు, బోనెట్‌కు సొట్ట‌లు ప‌డ్డాయి. సైకిల్‌కు మాత్రం ఏమీ కాలేదు. పైగా అది ఆడ‌పిల్ల‌లు తొక్కే సైకిల్ అని, ఆ కారు ఖ‌రీదైన‌దిగానే క‌నిపిస్తోంది క‌దూ! చైనాలోని షెన్జెన్ ప్రావిన్స్‌లో చోటు చేసుకున్న ఘ‌ట‌న ఇది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.