బ్యాట్మెంటన్ ఆడుతూ కోర్టులోనే కుప్పకూలిపోయిన భారతీయ సంతతికి చెందిన వ్యక్తి.. వీడియో వైరల్..!

ప్రస్తుత కాలంలో ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పులు రావడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల ప్రజల ఆయుషు కూడా రోజురోజుకీ తగ్గిపోతుంది. 40 50 సంవత్సరాల లోపు వయసు గల వారికి కూడా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఎంతోమంది మరణిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల కూడా ఇటువంటి సంఘటన మస్కట్‌లో చోటుచేసుకుంది. బ్యాట్మెంటన్ ఆడుతున్న వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు.

వివరాలలోకి వెళితే… కేరళకు చెందిన వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి మస్కట్ లో నివాసం ఉంటున్నాడు. స్వతహాగా క్రీడా ప్రేమికుడైన సదరు వ్యక్తి స్నేహితులతో కలిసి తరచు బ్యాట్మెంటన్ ఆడేవాడు. ఇటీవల కూడా తన స్నేహితులతో కలిసి బ్యాట్మెంటన్ ఆడుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అయితే ఇలా అతను కుప్పకూలి పడిపోవడంతో స్నేహితులు వెంటనే అతనిని గమనించి లేపటానికి ప్రయత్నించారు. అయితే అతడు రెస్పాండ్ అవ్వకపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించి అతను అప్పటికి గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఈ ఘటన జనవరి 2న చోటుచేసుకుంది. ఈ ఘటనకు అక్కడ ఉన్న సిసి కెమెరాలో రికార్డు కావడంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సదరు వ్యక్తి మరణంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబానికి అండగా ఉండాల్సిన కుమారుడు ఇలా మరణించడంతో అతని తల్లిదండ్రులు తీవ్రంగా విలపిస్తున్నారు.ప్రస్తుత కాలంలో ఇలాంటి మరణాల రేటు రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇక వయసులో ఉన్న యువకులు కూడా ఇలా కార్డియాక్ అరెస్ట్ వల్ల నిమిషాల వ్యవధి లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. అందువల్ల శరీరంలో ఏ చిన్న మార్పులు జరిగినా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.