పాకిస్థాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ నాయకత్వం వహిస్తున్న పాకిస్తాన్ తెహ్రీక్-ఈ -ఇన్సాఫ్ 115 స్థానాల్లో గెలిచి అతి పెద్ద పార్టీ గా అవతరించింది . సాధారణ మెజారిటీ కి 22 సీట్లు తక్కువ ఉండటంతో ఇమ్రాన్ ఖాన్ ఇండిపెండెంట్లు మరియూ చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యబోతున్నాడు.
సాధారణంగా పార్టీ అధ్యక్షులు లేదా ప్రజాధారణ కలిగిన నేతలు ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చెయ్యడం సహజం . ఎందుకంటే అది పార్టీ కి కొంత మైలేజ్ ఇస్తుంది కార్యకర్తల్లో జోష్ నింపుతుంది . కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ ఏకంగా ఐదు స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు . ఆయన ప్రధానిగా ప్రమాణం చెయ్యబోయే ముందు నాలుగు స్థానాలకు రాజీనామా చెయ్యవలసివుంది