రామ్ చ‌ర‌ణ్ భార్య పుట్టింట్లో విషాధం

మెగా ప‌వర్ స్టార్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న పుట్టింట్లో విషాదం చోటుచేసుకుంది. ఉపాస‌న తాత‌య్య కామినేని ఉమాప‌తిర‌వు క‌న్నుమూసారు. కొన్ని రోజులు అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న ఆయ‌న హైద‌రాబాద్ అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతు తుదిశ్వాస విడిచారు. వ‌యోభారం రీత్యా శ‌రీరం ఆరోగ్యానికి స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో చ‌నిపోయిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఉపాస‌న పుట్టింటి స‌హా మెగా ఫ్యామిలీలో విషాదం అలుముకుంది. ఆయ‌న మృతికి మెగా ఫ్యామిలీ ప్ర‌గాఢ సానుతూతి తెలిపింది. ఇంకా ప‌లువురు సినీ, రాజ‌కీయ‌, పారిశ్రామిక ప్ర‌ముఖులు విచారం వ్య‌క్తం చేసారు. ఉపాస‌న స‌న్నిహితులు, స్నేహితులు ఉమాప‌తిరావు మ‌ర‌ణం ప‌ట్ల సంతాపం ప్ర‌క‌టించారు.

తాత‌య్య మ‌ర‌ణం ప‌ట్ల‌ ఉపాసన భావోద్వేగానికి గుర‌య్యారు. నిస్వార్ధం, మాన‌వ‌త్వం, హాస్య చ‌తుర‌త ఉన్న ఆయ‌న ఉర్దులో ప్ర‌త్యేకంగా రాసిన ర‌చ‌న‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేద‌న్నారు. హాస్య చ‌తుర‌త కూడా ఎక్కువే. మీ ఆత్మ‌కు శాంతి చేకూరాలి తాత‌య్య అని భావోద్వేగానికి ఉగ‌ర‌య్యారు. తాత‌య్య మ‌ర‌ణం ప‌ట్ల బాధ‌ప‌డేవారంతా క‌న్న‌టీతో కాకుండా చిరున‌వ్వుతో ప్రేమ‌ని కురిపించాల‌ని ఉపాస‌న ఎమోష‌న్ అయ్యారు. ఉమాప‌తిరావు తెలంగాణ‌లోని దోమ‌కొండ‌లో జ‌న్మించారు. ఐపీఎస్ ఆఫీస‌ర్ గా ప‌నిచేసారు. దీనిలో భాగంగా వివిధ హోదాల్లో ఆయ‌న దేశానికి సేవ‌లందించారు. అలాగే టీటీడీ తొలి ఈవోగా పనిచేశారు. సామాజిక కార్య‌క్ర‌మాల్లోనూ ఉపమాప‌తిరావుకి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles