‎Upasana: తన విజయం గురించి అలాంటి కామెంట్స్ చేసిన ఉపాసన.. పెళ్లితో విజయం దక్కలేదు అంటూ!

Upasana: మెగా కోడలు, టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ భార్య, అపోలో హాస్పిటల్ చైర్మన్ ఉపాసన కామినేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అని చెప్పాలి. ఒకవైపు మెగా కోడలుగా బాధ్యతలను నిర్వహిస్తూనే మరొకవైపు అపోలో హాస్పిటల్ చైర్మన్గా కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ బాధ్యతలను చూసుకుంటూ బిజినెస్ రంగంలో కూడా రాణిస్తోంది. అప్పుడప్పుడు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటుంది ఉపాసన.

‎ అలాగే సమయం దొరికినప్పుడల్లా తన భర్త రామ్ చరణ్, కూతురు క్లీంకారతో కలిసి వెకేషన్ కి కూడా వెళ్తూ ఉంటారు.అలాగే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ అప్పుడప్పుడు స్పెషల్ పోస్ట్ లు కూడా చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఉపాసన చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే.. నేను ఎంచుకున్న రంగంలో ఎన్నో ఒత్తిళ్లు అధిగమించి ఒక స్థాయికి చేరుకోవడం వల్లే గుర్తింపు దక్కింది.

‎వారసత్వంతోనో, పెళ్లితోనో కాదని తెలిపారు ఉపాసన ఒక వ్యక్తిని సంపద, హోదా, విజయం లాంటివి గొప్పగా చూపిస్తాయా? స్పందించే గుణం, ఇతరులకు సహాయం చేయడం లాంటివి గొప్పవారిని చేస్తాయా? అనే వాటికి ఎవరికి వారే సమాధానం వెతుక్కోవాలి. మనల్ని మనం ప్రేమించుకొని, మనకు మనం విలువ ఇచ్చుకున్న క్షణం మనల్ని ప్రత్యేకంగా నిలుపుతుందని భావిస్తున్నాను. వృత్తిపరమైన విజయాలనే సమాజం గుర్తిస్తోంది. మహిళలు పెద్ద కలలు కనేందుకు వారికి ఇచ్చే ప్రోత్సాహం తక్కువ. ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. విజయం దానంతట అదే వస్తుంది అని రాసుకొచ్చింది ఉపాసన. ఈ సందర్భంగా ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.