‎Upasana: ఉపాసనకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం.. నెట్టింట ఫోటోస్ వైరల్!

‎Upasana: మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అని చెప్పాలి. ఒకవైపు మెగా కోడలుగా బాధ్యతలను నిర్వహిస్తూనే మరొకవైపు అపోలో హాస్పిటల్ చైర్మన్గా కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. బిజినెస్ రంగంలో కూడా రాణిస్తోంది. అప్పుడప్పుడు మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటుంది ఉపాసన. అలాగే సమయం దొరికినప్పుడల్లా తన భర్త రామ్ చరణ్ కూతురు క్లీంకారతో కలిసి వెకేషన్ కి కూడా వెళ్తూ ఉంటారు.

‎ ఇది ఇలా ఉంటే తాజాగా ఉపాసనకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే ఉపాసనకు తెలంగాణ ప్రభుత్వం కీల‌క బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది. తెలంగాణ స్పోర్ట్స్ హ‌బ్‌కు కోఛైర్మ‌న్‌ గా ఉపాస‌న‌ను నియ‌మించింది. త‌న‌కు ఈ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌డం ప‌ట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె ధ‌న్య‌వాదాలు కూడా తెలియ‌జేశారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవ‌ల‌ కొత్తగా క్రీడా పాలసీని ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ప‌బ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ కు ప్ర‌భుత్వం పెద్ద పీఠ వేసింది.

https://twitter.com/upasanakonidela/status/1952247298181992669?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1952247298181992669%7Ctwgr%5E18568592283e3e966d47c3efc658fe860b4ae62c%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Ftelugu-news%2Fmovies%2Fupasana-named-co-chair-of-telangana-sports-hub-vm-975534.html

‎ఇందులో భాగంగా క్రీడారంగాల్ని ప్రోత్సాహిస్తున్న కార్పొరేట్ సంస్థలు, ఆ రంగంలో విశేష అనుభవం ఉన్నవాళ్లతో ఒక బోర్డును ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌ ని నియమించింది. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌, ఐపీఎల్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స‌జ్ ఓన‌ర్ అయిన సంజీవ్‌ గొయెంకాను దీనికి ఛైర్మ‌న్‌ గా నియ‌మించారు. కో ఛైర్మ‌న్‌ గా ఉపాస‌న‌ను ఎంపిక చేశారు. ఈ క్ర‌మంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోష‌ల్ మీడియా వేదిక‌గా ఉపాస‌న ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. సంజీవ్ గొయెంకాతో క‌లిసి ప‌ని చేసే అవ‌కాశం రావడం గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.