Today Horoscope : నవంబర్ 7th శనివారం మీ రాశి ఫలాలు

today january 12th 2021 daily horoscope in telugu

మేష రాశి : ఈరోజు అనుకోని బహుమతులు అందుకుంటారు !

బంధువులు మీరు ఎదురు చూడని బహుమతులు తెస్తారు, కానీ వారు మీనుండి కొంత సహాయం ఆశిస్తారు. మీరు మదుపు చేస్తే తప్పక లబ్దిని మ్పొందుతారు. క్రొత్త ప్రతిపాదనలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ ఏవిధమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తెలివైన పనికాదు. ఈ రో జు మీరు మీ జీవిత భాగస్వామిని ఆనందంలో ముంచేలా ఏదైనా ప్లాన్‌  చేయండి.

పరిష్కారాలు: సంపన్నమైన కుటుంబ జీవితాన్ని అనుభవించడానికి శ్రీలక్ష్మీ ఆరాధన చేయండి.

వృషభ రాశి: ఈరోజు పవిత్ర వేడుకలు నిర్వహిస్తారు !

మీకుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియచేయటం వలన మీరు కాస్త తేలికపొందుతారు, మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. మీకున్న నిధులు ఖర్చు అవుతాయి. జీవితం లో బాగా స్థిరపడినవారు, మీ భవిష్యత్ ధోరణుల గురించి మంచి చెడ్డ లు చెప్పగలిగినవారితోను కలిసి ఉండండీ. పవిత్రమైన వేడుకలు ఇంటి లో నిర్వహించబడతాయి. వివాహం సంబంధించిన మంచి కోణాన్ని అనుభూతి చెందేందుకు ఇది చక్కని రోజు.

పరిష్కారాలు: అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం ఆదిత్యహృదయం పారాయణం చేయండి.

మిథున రాశి: ఈరోజు కోపాన్ని అధిగమించండి !

మీరు కోపాన్ని అధిగమించాలి. మీలో విశ్వాసం పెరుగుతోంది, అభివృద్ధి కానవస్తోంది. మీకు నచ్చినట్లుగా పిల్లలు ప్రవర్తించరు. మీకు చీకాకు తెప్పించుతారు. గతంలో మదుపుచేసిన పెట్టుబడిలో, ఇప్పుడు ఆదాయంలో పెరుగు దలగా కన్పిస్తుంది. మీరు మానసికంగా ప్రశాంతం గా ఉంటారు. ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఏదో షేర్ చేసుకోవడాన్ని మర్చిపో యారు. దీంతో వారు మీతో గొడవ పడతారు.

పరిష్కారాలు: ఆరోగ్య ప్రయోజనాలు కోసం శ్రీలక్ష్మీనారాయణులను ఆరాధించండి.

కర్కాటక రాశి: ఈరోజు ప్రేమ జీవితం బాగుంటుంది !

మీసమస్యలను మరచి, మీ కుటుంబ సభ్యులతో సమయం చక్కగా గడపనున్నారు. వివాహం అయినవారు వారి సంతానం చదువు కొరకు డబ్బుని వెచ్చించవలసి ఉంటుంది. చాలా విభేదాలు ఉన్నప్పటికీ ఈరోజు మీ ప్రేమజీవితం బాగుంటుంది. మోసపోకుండా కాపాడుకుంటూ ఉండేందుకు వ్యాపారంలో మెలకువగా అన్నీ గమనిస్తూ ఉండండి. అనవసర పనుల వలన ఈరోజు మీసమయము వృధాఅవుతుంది. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అంతా ఆనందమే కన్పిస్తూ మిమ్మల్ని ఆనందింపజేస్తూ ఉంటుంది.

పరిష్కారాలు: వృద్ధి చెందుతున్న వ్యాపారం కోసం శ్రీసీతారామ ఆరాధన చేయండి.

Today horoscope 7th november 2020

సింహ రాశి : ఈరోజు సురక్షిత పథకాలలో పెట్టుబడి పెట్టండి !

మీరొకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే- సురక్షిత మయిన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి. మీ తిండిని నియంత్రిం చండి. బలంగా ఉండడానికి వ్యాయామం చెయ్యండి. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. కళలు, రంగ స్థలం సంబంధిత కళాకారులకు, వారి కళను ప్రదర్శిం చడానికి, ఎన్నె న్నో క్రొత్త అవకాశాలు వస్తాయి. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీరు ఊహించని విధంగా అవసరాలను పట్టించుకుంటారు.

పరిష్కారాలు: గోశాలలో దానానను సమర్పించండి. దీనివల్ల గొప్ప ఆరోగ్యాన్ని పొందుతారు.

కన్యా రాశి : ఈరోజు ఖర్చులు పెరుగుతాయి !

స్నేహితుల సాన్నిధ్యం హాయినిస్తుంది. ఈరోజు క్రొత్త భాగస్వామిత్వం, ప్రమాణ పూర్వకమైనది. ఖర్చు పెరుగుతుంది, అలాగే ఆదాయం మీబిల్లుల గురించి జాగ్రత్త తీసు కుంటుంది. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్లో ఉంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వా మి చెప్పే అబద్ధం మిమ్మల్ని అప్సెట్ చేయవచ్చు. అది చిన్నదైనా సరే.

పరిష్కారాలు: కుటుంబజీవితంలో ఆనందంగా ఉండటానికి శ్రీలక్ష్మీ స్తోత్రం పారాయణం చేయండి.

తులా రాశి : ఈరోజు భాగస్వామ ఒప్పందాలకు దూరంగా ఉండండి !

ఇంటిపనులు పూర్తి చేయడంలో, పిల్లలు మీకు సహాయపడతారు. ఈరోజు మీరు అనుభవిస్తున్న జీవిత సమస్య లను మీ భాగస్వామితో పంచుకుంటారు. ఈరోజు మీతోబుట్టువులలో ఒకరు మీదగ్గర ధనాన్ని అప్పుగా స్వీకరిస్తారు. మీరు వారికోరికను నెరవేరుస్తారు. కానీ ఇది మీఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. ఒకవేళ మీరు క్రొత్తగా భాగ స్వామ్యం గల వ్యాపార ఒప్పందాల కోసం చూస్తుంటే మీరు ఒప్పందం చేసుకునే ముందుగానే అన్ని వాస్తవాలను తెలుసుకొని ఉండడం మంచిది. ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు.

పరిష్కారాలు: ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిత్యం సూర్యారాధన చేయండి.

వృశ్చిక రాశి : ఈరోజు జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు !

మదుపు చేయడం మంచిదే కానీ సరియైన సలహా తీసుకొండి. ఈరాశికి చెందినవారికి మీకు మీకొరకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది. మీరు ఈ సమయాన్ని పుస్తకపఠనం కోసం వాడుకుంటారు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీలోని అన్ని గొప్ప గుణాలనూ ఎంతగానో పొగడటం, మీకు మరోసారి పడిపోవడం ఖాయం. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

పరిష్కారాలు: పేదప్రజలకు ఆహారపదార్థాలు దానం చేయండి. దీనిద్వారా ఆరోగ్యంగా ఉండండి.

ధనుస్సు రాశి : ఈరోజు ఆఫీస్‌లో లోపాలను సరిచేసుకోండి !

పిల్లలు మీ ఇంటిపనులు పూర్తి చేయడంలో సహాయం చేస్తారు. ఆఫీసులో ఈ రోజు అంతటా మీరు మీలోపాలను సరిచేసుకోవలసి ఉంటుంది. ఈరోజు ఎవరైతే ఆర్ధిక సహాయంపొంది, తిరిగి ఇవ్వకూండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి. ఇటీవలి గతంలో కొన్ని దుస్సం ఘటనలు జరిగినా మీ పట్ల తనకు ఎంతటి ఆరాధనా భావముందో మీ జీవిత భాగస్వామి మీకు ఈ రోజు గుర్తు చేయవచ్చు.

పరిష్కారాలు: సప్తముఖి రుద్రాక్ష ధరించండి.

మకర రాశి : ఈరోజు పిల్లల విజయం మీక ఆనందం !

ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది. మీ వ్యక్తిగత సమస్యలు, మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి. కానీ మీకు డబ్బువిలువ బాగా తెలుసు. పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని, గర్వపడేలాగ చేస్తారు. ఆఫీసులో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు. మీ బలహీన తలన్నింటినీ మీ బెటర్ హాఫ్ దూరం చేసేస్తారు.

పరిష్కారాలు:ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు శివారాధన చేయండి.

కుంభ రాశి : ఈరోజు దుబారా ఖర్చులకు దూరంగా ఉండండి !

మీ అంచనాల మేరకు ఉండడంలో విఫలమై మిమ్మల్ని నిరాశకు గురిచేస్తారు. ఇతరులను మెప్పించాలని మరీ ఎక్కువగా దూబరా ఖర్చు పెట్టకండి. పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్ లు, పథకాలు కదిలి చివరి అంకానికి వస్తాయి. ఈరోజు మీరు ధైర్యంగా ఉండండి. కానీ మెప్పుపొం దగల పనులనే చెయ్యండి. మీ భాగస్వామితో ఈ రోజు మీ ఆత్మ సంబంధం అనుభవంలోకి రానుంది.

పరిష్కారాలు:మంచి ఆరోగ్యాన్ని పొందడానికి ఇష్టదేవతరాధన చేయండి.

మీన రాశి : ఈరోజు శుభవార్త వింటారు !

మీ పిల్లల నుండి కొన్ని పాఠాలను నేర్చుకోబోతున్నారు. మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది. అది మీ నైతిక బలాన్ని మరింత మెరుగు పరుస్తుంది. వృత్తివ్యాపారాల్లో మీతండ్రిగారి సలహాలు మీకు ప్రయోజ నాన్ని చేకూరు స్తాయి. ఈరోజు మీ సహుద్యోగులు మీ ఉన్నతా ధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. మీ పనిపట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచిలాభాలు పొందుతారు. మీ భాగస్వామితో ఆనందాన్ని పంచుకుంటారు.

పరిష్కారాలు: శ్రీలక్ష్మీసూక్తం పారాయణం చేయడం వల్ల శుభఫలితాలు వస్తాయి.