Today Horoscope : జనవరి 31st ఆదివారం మీ రాశి ఫ‌లాలు

today january 31st 2021 daily horoscope in telugu

మేష రాశి : పరిచయాలు పెరుగుతాయి !

ఈరోజు ఉద్యోగయత్నాలు సానుకూలం. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. ఈరోజు పరిచయాలు పెరుగుతాయి. ఈరోజు ఆరోగ్యం విషయం లో జాగ్రత్త వహించండి. ఈరోజు సంఘంలో గౌరవం పెరుగుతుంది. పేదలకు ఆర్థిక సహాయం చేయండి.

వృషభ రాశి : ఈరోజు లాభదాయకంగా ఉంటుంది !

ఈరోజు వృత్తి పరంగా మీకు లాభదాయకంగా ఉంటుంది. మీపై అధికారుల సహాయంతో మీరు అడ్డంకులను తొలగిస్తారు. ఈరోజు మీకు కొన్ని శుభవార్తలు ఉంటాయి. మీ సన్నిహితులు, స్నేహితులు మీకు పూర్తి గా సహకరిస్తారు. కుటుంబ సభ్యులు కూడా మీకు మద్దతు ఇస్తారు. ఈరోజు వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

మిధున రాశి : ఈరోజు మీకు కుటుంబంలో మద్దతు !

ఈరోజు సానుకూల ఫలితాలుంటాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. గతంలో కంటే మెరుగ్గా మీ పనులను నిర్వర్తించగలుగుతారు. ఈరోజు మీకు కుటుంబంలో మద్దతు లభిస్తుంది. పెట్టుబడులలో డబ్బులు పెట్టె విషయంలో జాగ్రత్త వహించండి. ఈరోజు అదృష్టం మీ వెంటే ఉంటుంది. దామోదరాష్టకం చదవండి.

కర్కాటక రాశి: ఈరోజు సంతోషంగా గడుస్తుంది !

ఈరోజు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పనిని పూర్తి చేసుకోగలుగుతారు. ఈరోజు సంతోషంగా గడుస్తుంది. పరిస్థితులు కొత్త మలుపును తీసుకోనున్నాయి. మీ సోదర సోదరీమణులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఈరోజు ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు శుభకరంగా ఉంటుంది. శివుడిని మారేడుదళాలతో ఆరాధిస్తే మంచి ఫలితం వస్తుంది.

సింహ రాశి: ఆదాయాలు పెరుగుతాయి !

ఈరోజు శుభప్రదంగా ఉంటుంది, బాగా కలిసి వస్తుంది. ఈరోజు ఆదాయాలు పెరుగుతాయి. పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కలిసి వచ్చే సమయం. ఈరోజు ఆచితూచి వ్యవహరించడం మంచిది. వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

కన్య రాశి: ఆర్థిక సమస్యలు పరిష్కరించుకుంటారు !

ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. మీలో ప్రతిభను దాచడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు రోజువారీ పనులను యధావిధిగా పూర్తి చేస్తారు. ఈరోజు ఆర్థిక సమస్యలు పరిష్కరించుకుంటారు. ‘ఓం నమో భగవతే వాసుదేవాయనమః’’ అనే నామాన్ని 108 సార్లు పారాయణం చేయండి.

తులా రాశి: గౌరవ మర్యాదలు పెరుగుతాయి !

ఈరోజు సానుకూల ఫలితాలుంటాయి.ఈరోజు పని వాతావరణం లోను, కుటుంబ వాతావరణం లోను ప్రశాంతత కనిపిస్తుంది. ఈరోజు సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈరోజు మీరు ఉల్లాసంగా ఉంటారు. మీ సహోద్యోగులు, పై అధికారులు మీకు మద్దతు పలుకుతారు. ఈరోజు ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. శ్రీకార్తీకదామోదర ఆరాధన చేయండి.

today january 31st  2021 daily horoscope in telugu
today january 31st 2021 daily horoscope in telugu

వృశ్చిక రాశి: ఈరోజు కీర్తి లభిస్తుంది !

ఈరోజు మీ వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. సామాజిక పనుల ద్వారా మీకు కీర్తి లభిస్తుంది. మీరు ఇంతకుముందు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు లాభం చేకూరుస్తాయి. ఈరోజు జీవిత భాగస్వామి నుంచి మద్దతు అందుకుంటారు. ఈరోజు అప్రమత్తం గా ఉండాలి. శ్రీవేంకటేశ్వర వజ్రకవచ పారాయణం మంచి ఫలితం వస్తుంది.

ధనుస్సు రాశి: ప్రయత్నాలు విజయవంతమవుతాయి !

ఈరోజంతా ఆనందంగా గడుపుతారు. మీరు చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఈరోజు మీ కుటుంబంలో శుభకార్యం జరగబోతోంది. ఈరోజు మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మంచి సమయం. శ్రీలక్ష్మీదేవిని ఆరాధించండి.

మకర రాశి: ఈరోజు సరదాగా గడుపుతారు !

ఈరోజు కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలను అందుకుంటారు. ఇతరులు మీకు సహాయం చేస్తారు. ఈరోజు వీలైనంత వరకు వివాదాలకు, తగవులు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, సరదాగా గడుపుతారు. ఏదైనా దేవాలయంలో దానధర్మాలు చేయండి.

కుంభ రాశి: ప్రయాణంలో మీకు విజయం !

ఈరోజు ప్రయాణంలో మీకు విజయం లభిస్తుంది. ఈరోజంతా సరదాగా గడిపేస్తారు. సమాజంలో మీ ఇమేజ్ పెరుగుతుంది. ఈరోజు మీరు విజయం సాధిస్తారు. ఈరోజు పనులను పూర్తి చేయడానికి ఉపక్రమిస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

మీన రాశి: ఈరోజు ఆనందాన్ని పొందుతారు !

ఈరోజు ఒత్తిడికి లోనవుతారు.మీరు ఆరోగ్యం బాగుండదు. భాగస్వామి నుంచి ఆనందాన్ని పొందుతారు. ఈరోజు ఏదైనా ఉదార సంబంధమైన ఇబ్బంది తలెత్తవచ్చు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఓం శ్రీ అక్షరాయనమః అనే మంత్రాన్ని పారాయనం చేయండి అనుకూల ఫలితాలు వస్తాయి.