మేషరాశి : శ్రమ పెరుగుతుంది !
ఈరోజు అనుకున్న పనుల్లో జాప్యం. ఈరోజు నూతనోత్సాహంతో పని చేస్తారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికి పనులను సక్రమంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఈరోజు మీరు కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. పై అధికారులతో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈరోజు శ్రమ పెరుగుతుంది. శివాభిషేకం చేయించుకోండి.
వృషభరాశి: ఈరోజు కష్టకాలంగా ఉంటుంది !
వ్యాపారస్తులకు ఈరోజు కష్టకాలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. అనవసర బాధ్యతలను మోయాల్సి వస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఈరోజు ఉద్యోగస్తులకు పై అధికారులతో తలనొప్పులు ఉంటాయి. శ్రమాధిక్యం. ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంటుంది. శ్రీరామరక్షా స్తోత్రం పారాయణయం చేయండి.
మిధునరాశి: ఉద్యోగయత్నాలు సానుకూలం !
ఈరోజు పరిచయాలు పెరుగుతాయి.ఉద్యోగ సంబంధ సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు కార్యాలయంలో పని వాతావరణాన్ని మెరుగుపరుస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఈరోజు వ్యాపార మెళకువలు తెలుసుకుంటే మంచిది. ఈరోజు ఉద్యోగయత్నాలు సానుకూలం. ఎరుపు రంగు దుస్తులను దానం చేయండి.
కర్కాటకరాశి: ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి !
ఈరోజు సంతోషంగా గడుస్తుంది. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. అనవసరంగా ఖర్చులు చేయవద్దు. డబ్బుని పొదుపు చేయాల్సి ఉంటుంది. ఈరోజు బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఈరోజు మీ ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. పేదలకు ఆహార పదార్థాలు పంపిణీ చేయండి.
సింహరాశి: ఈరోజు శ్రమ ఫలిస్తుంది !
ఈరోజు శ్రమ ఫలిస్తుంది. మిత్రులతో ఏర్పడ్డ వివాదాలు సమసిపోతాయి. ఈరోజు కీలక పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారవుతాయి. ఈరోజు సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకుంటారు. బంధువులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు కుటుంబ పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సప్తముఖి రుద్రాక్ష ధరించండి.
కన్యరాశి: వివాదాలు పరిష్కారం అవుతాయి !
ఈరోజు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ఈరోజు ఆరోగ్య విషయంలో శ్రధ్ధా వహించండి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఈరోజు కుటుంబంలో ఒత్తిడులు. బంధువులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కారం అవుతాయి. పేదలకు వస్త్రాలు దానం చేయండి.
తులరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది !
ఈరోజు కుటుంబంలో ప్రోత్సాహం.అరుదైన ఆహ్వానాలు లభిస్తాయి. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం పొందుతారు. సోదరులతో సంతోషంగా ఉంటారు. ఈరోజు ఆహ్వానాలు అందుతాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. శ్రీగణపతి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి: వ్యవహారాలలో పురోగతి !
ఈరోజు వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పాటించండి. ఈరోజు వ్యవహారాలలో పురోగతి. క్రయవిక్రయాలలో లాభాలు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాలగవు. ఈరోజు ఉన్నత స్థాయి మహిళల నుంచి లాభాలు పొందుతారు. శివారాధన చేయండి.
ధనుస్సురాశి: మిత్రులతో సంతోషంగా గడుపుతారు !
ఈరోజు రుణాలు చేస్తారు.ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. కీలక నిర్ణయాలలో ఆచి తూచి వ్యవహరించండి. ఈరోజు కష్టపడ్డా ఫలితం కనిపించదు. రుణ బాధలు తీరతాయి. ఈరోజు పాత మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు.బంధువులతో సఖ్యంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. శ్రీలక్ష్మీ ఆరాధన చేయండి.
మకరరాశి: ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి !
ఈరోజు దూర ప్రాంతాల నుంచి విలువైన సమాచారం లభిస్తుంది. బంధువులతో వివాదాలు. ఈరోజు ఇంటాబయటా అభివృద్ధి సాధిస్తారు. విలువైన వాటిని కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఈరోజు ఉద్యోగాలలో కొత్త సమస్యలు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నారసింహస్వామి ఆరాధన చేయండి.
కుంభరాశి: శుభవార్తలు వింటారు !
ఈరోజు పరిస్థితులు అనుకూలిస్తాయి.కొత్త మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు.ఇతరుల విషయాలకు దూరంగా ఉండండి. ఈరోజు కొత్త పనులు ప్రారంభిస్తారు. శుభవార్తలు వింటారు. ఈరోజు రుణ వత్తిడి తీరుతుంది. మానసికంగా ప్రశాంతతను పొందుతారు. ఈరోజు అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అనుకోని అవకాశాలు లభిస్తాయి. శనిగ్రహానికి తైలాభిషేకం చేయండి.
మీనరాశి: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు !
ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకునేటపుడు సొంతంగా ఆలోచించుకోండి. వ్యవహారాలలో విజయం. కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. ఈరోజు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. మానసిక ఆందోళనల పై పట్టు సాధిస్తారు. ఈరోజు కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమస్యలు పరిష్కరించుకుంటారు. ఈరోజు కుటుంబంతో సంతోషంగా ఉంటారు. మీ నుదిటిపై కుంకుమని వర్తించండి.