Today Horoscope : జనవరి 19th మంగళవారం మీ రాశి ఫ‌లాలు

today january 19th 2021 daily horoscope in telugu

మేషరాశి: ఈరోజు ఉద్యోగవర్గాలకు నూతనోత్సాహం !

ఈరోజు కొత్త పనులు చేపడతారు.కుటుంబంలో పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వ్యాపారాలు లాభిస్తాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. ఈరోజు ఎంతగా శ్రమించినా ఫలితం దక్కకపోవచ్చు. ఉద్యోగవర్గాలకు నూతనోత్సాహం. బంధువులతో ఏర్పడ్డ తగాదాలు పరిష్కారం అవుతాయి. శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృషభరాశి: ఈరోజువ్యవహారాలలో అభివృద్ధి !

ఈరోజు ఆరోగ్యం విషయంలో చికాకులు ఉంటాయి. విలువైన వస్తువులు కొంటారు. వాహనాలు నడిపేడపుడు జాగ్రత్త. వృత్తి, వ్యాపారాలలో అనుకూలస్థితి. ఈరోజు ఉద్యోగులకు పదోన్నతులు, హోదాలు పెరుగుతాయి. ఈరోజు చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలలో అభివృద్ధిని సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలం గా ఉంటాయి. ఈరోజు ఆహ్వానాలు అందుతాయి. లక్ష్మీదేవి పారాయణం చేసుకోండి.

మిధునరాశి: ఈరోజు పనుల్లో జాప్యం !

ఈరోజు సేవ కార్యక్రమాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిపెట్టవచ్చు. ఖర్చులు జాగ్రత్త. ఈరోజు మహిళలు అప్రమత్తంగా ఉండాలి. పనుల్లో జాప్యం. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఈరోజు బంధువులను కలుసుకుంటారు. కొత్త కార్యక్రమాలు మొదలెడతారు. హైగ్రీవ పారాయణం చేసుకోండి.

కర్కాటకరాశి: ఈరోజు వ్యాపారాలు మందగిస్తాయి !

ఈరోజు ఖర్చుల విషయంలో జాగ్రత్త.ఆచితూచి వ్యవహరించడం అలవాటు చేసుకోండి. ఈరోజు పనుల్లో తొందరపాటు. సభలు, సమావేశాల్లో పాల్గొనే సూచనలు ఉన్నాయి. ఇంటాబయటా ఒత్తిడులు. ఈరోజు ఆర్థిక పరిస్థితులు కొంత అనుకూలిస్తాయి. వ్యాపారాలు మందగిస్తాయి. శివాభిషేకం చేసుకోండి అంతా మంచే జరుగుతుంది.

సింహరాశి: అప్పులు తీరుస్తారు !

ఈరోజు పాతబాకీలు అందుతాయి.వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. ఈరోజు ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పనుల్లో ముందడుగు వేస్తారు.కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఈరోజు ఆలోచనలు అమలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఈరోజు చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఈరోజు అప్పులు తీరుస్తారు. ఈరోజు దత్త చరిత్ర పారాయణం చేసుకోండి.

కన్యరాశి: ఈరోజు పనులు వాయిదా !

వివాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు పనులు వాయిదా వేస్తారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఈరోజు ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. కొన్ని విషయాలలో కంగారు పడతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసే సూచనలున్నాయి. ఈరోజు వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. చంద్రశేఖర్ స్తోత్ర పారాయణం చేసుకోండి.

తులరాశి : పలుకుబడి పెరుగుతుంది !

శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ఈరోజు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. పలుకుబడి పెరుగుతుంది. ఈరోజు ఉద్యోగాలలో స్థానచలనాలు, బదిలీ సూచనలు ఉండే అవకాశం ఉంది. ఈరోజు కుటుంబసభ్యులతో సుఖంగా ఉంటారు. పనుల్లో విజయం. ప్రయాణాలలో జాగ్రత్త. ఆరోగ్యం జాగ్రత్త. ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృశ్చికరాశి:  ఈరోజు శుభవార్తలు వింటారు !

ఈరోజు ఇతరుల విషయాలకు దూరంగా ఉండండి. పనులలో స్వల్ప ఆటంకాలు. ఈరోజు మాట్లాడేటపుడు నోరు జారవద్దు. వ్యాపారస్తులు కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఈరోజు ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఆలయాలు సందర్శిస్తారు. నారాయణ ద్వాదశాక్షరీ స్తోత్ర పారాయణ చేసుకోండి లేదా వినండి.

ధనుస్సురాశి: ఈరోజు చేపట్టిన పనులలో ఆటంకాలు !

ఈరోజు వివాదాలకూ దూరంగా ఉండండి. వ్యవహారాలలో విజయం. ఈరోజు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైన సకాలంలో పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. ఇతరులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త పాటించండి. ఈరోజు రుణాలు తీసుకునేటపుడు జాగ్రత్త. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూలమైన కాలం, నూతనోత్సాహం. ఈరోజు భావోద్వేగాలను అదుపులో పెట్టుకోండి. కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకరరాశి: ఈరోజు కొత్త వ్యక్తులతో పరిచయాలు !

ఈరోజు నూతన కార్యక్రమాలు మొదలు పెడతారు. వ్యవహారాలలో విజయం. ఈరోజు సోదరుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఈరోజు వృత్తి, వ్యాపారాలలో ఎదురైనా ఆటుపోట్లు, ఇబ్బందులను తెలివిగా అధిగమిస్తారు. ఈరోజు వివాదాల పరిష్కారం. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మంగళ చండికా స్తోత్రం పారాయణం చేసుకోండి.

today january 19th 2021 daily horoscope in telugu
today january 19th 2021 daily horoscope in telugu

కుంభరాశి: సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు !

ఈరోజు కుటుంబసభ్యులతో వివాదాలు. నిరుద్యోగులకు ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఈరోజు కొన్ని పనులు వాయిదా వేస్తారు. స్థిరాస్తి అమ్మకానికి చేసే ప్రయత్నాలను ప్రస్తుతానికి వాయిదా వేయండి. ఈరోజు వాహన యోగం ఉంది. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. ఈరోజు సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు అధిక ఒత్తిడి ఉంటుంది. వేంకటేశ్వర అష్టోత్తర పారాయణం చేసుకోండి.

మీనరాశి: వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి !

ఈరోజు శత్రువులు మిత్రులుగా మారతారు. బంధువులతో వివాదాలు. ఈరోజు ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఈరోజు ఆధ్యాత్మిక, సామాజిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బాధ్యతలు పెరుగుతాయి. ఈరోజు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు గతంలో ఆనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు తగాదాలకు దారి తీస్తాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేయండి.