Today Horoscope: జనవరి 4వ తేదీ బుధవారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి!

ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలన్నీ ఇతరులతో పంచుకోకండి. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. గతంలో పెట్టుబడు నుండి మంచి లాభాలను అందుకుంటారు. బంధువుల నుండి ఆహ్వానాలు అందితాయి. అమ్ములు నీ స్నేహితులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

వృషభరాశి: శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.

శత్రువులకు దూరంగా ఉండడం మంచిది. భూమికి సంబంధించిన విషయాల్లో మీరు జోక్యం చేసుకోకూడదు. మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరంటే గిట్టని వారి మీ విషయాల్లో తలదించడానికి ప్రయత్నిస్తారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం పడుతుంది. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

మిధునరాశి: అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు!

అనుకున్న పనులనే అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కరిస్తాయి. అధికంగా అభివృద్ధి కలుగుతుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనిలో అంతా మంచే జరుగుతుంది. కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కర్కాటక రాశి: చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా నిదానంగా పూర్తి చేస్తారు!

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైన నిదానంగా పూర్తి చేస్తారు. అప్పులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. మీ మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగమున ఉత్సాహం తప్పదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. గృహపకారాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలందుతాయి. కుటుంబ సభ్యులకు కలిసి కొన్ని విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహరాశి: ప్రయాణంలో నూతన వ్యక్తుల పరిచయాలు లభిస్తాయి!

ప్రయాణాల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు లభిస్తాయి. బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన ఉద్యోగ లభి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదల కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

కన్యరాశి:ఉద్యోగ వ్యవహారాల్లో తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు!

ఉద్యోగ వ్యవహారాల్లో తలపెట్టిన పనులు సకలంలో పూర్తి చేసి పై వారి నుండి ప్రశంసలు పొందుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతంగా చేస్తారు. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

తులరాశి: సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి!

సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు తీసుకున్న నిర్ణయాల వలన లాభాలు పొందుతారు. మీ తోబుట్టువుల నుండి తన సహాయం అందుతుంది. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వారితో చాలా సంతోషంగా ఉంటారు.

వృశ్చికరాశి: అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడతారు!

అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడతారు. కొన్ని దూరపు ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది. అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ. స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. చాలా సంతోషంగా ఉంటారు.

ధనుస్సురాశి: వ్యాపార పరంగా ఇబ్బందులు తొలుగుతాయి!

వ్యాపార పరంగా ఇబ్బందులు తొలుగుతాయి. ధన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మకరరాశి: ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది!

ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారాలు స్వీకరించడం మంచిది. రుణ బాధలు తొలగుతాయి. భూ సంబంధిత క్రమ విక్రమాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో సమస్యల నుండి బయటపడతారు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

కుంభరాశి: సంతానమునకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి!

సంతానమునకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సోదరుల సహాయ సహకారాలు పొందుతారు. వ్యాపార వృద్ధి చెందుతుంది. మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

మీనరాశి: ప్రయాణాల్లో మార్గవరోధాలు కలుగుతాయి!

ప్రయాణాల్లో మార్గవరోధాలు కలుగుతాయి. చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నేత్ర సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగం విషయాల్లో ఆలోచించత నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బంధువుల నుండి విమర్శలు ఎదురవుతాయి. దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.