Today Horoscope: డిసెంబర్ 8వ తేదీ గురువారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: వ్యాపారాల్లో విభేదాలు ఉంటాయి!

వ్యాపారాల్లో విభేదాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో చికాకులు తప్పవు. వాహనాలు ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా అవసరం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ఉద్యోగులకు నూతన సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు. ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

వృషభరాశి: నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలుగుతాయి!

నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. మీ చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. భూమికి సంబంధించిన విషయాలు మీరు జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

మిధునరాశి: వ్యాపారమున ఎంతగా శ్రమించిన ఫలితం కనిపించదు!

వ్యాపారమున ఎంతగా శ్రమించిన ఫలితం లభించక నిరాశ కలుగుతుంది. గృహమున పెద్దల ఆరోగ్య విషయం ఆందోళన కలిగిస్తుంది. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇతరులకు ధన వ్యవహారాలలో మాట ఇవ్వకపోవడం మంచిది. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.

కర్కాటక రాశి: మొండి బాకులు తీర్చగలుగుతారు!

మొండి బాకీలు తీర్చగలుగుతారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. విద్యార్థుల విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు. బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

సింహరాశి: నూతన వస్తువులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు!

నూతన వస్తువులను బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులకు కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు. గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలు అందుకుంటారు. ఇతరుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

కన్యరాశి: సంతాన విద్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి!

సంతాన విద్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది. ప్రయాణంలో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.

తులరాశి: ఉద్యోగమున అధికారుల అనుగ్రహం లభిస్తుంది!

ఉద్యోగమున అధికారులు అనుగ్రహం నూతన ఉద్యోగ అవకాశములు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది. కొన్ని కొత్త ప్రారంభించడానికి ఎంతో అనుకూలంగా ఉంది.

వృశ్చికరాశి: మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పులు కలుగుతాయి!

మీరు చేసే ఉద్యమంలో కొన్ని మార్పులు కలుగుతాయి. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. దూరప్రాణాలు మీకు అనుకూలిస్తాయి. ప్రయాణం చేసేటప్పుడు పిల్లలు పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. పనిచేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.

ధనుస్సురాశి: కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది!

మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఇతరులపై కోపాన్ని మీ కుటుంబ సభ్యులపై చూపిస్తారు. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది. అనారోగ్య సమస్యతో సతమతమవుతారు. దగ్గర్లో ఉన్న వైద్యున్ని సంప్రదించడమే మంచిది.

మకరరాశి: వాహనం కొనుగోలు చేస్తారు!

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. వాహనం కొనుగోలు ప్రయత్నాలు మీకు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది. కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

కుంభరాశి: ఈరోజు వ్యాపారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి!

మీరు చేసే వ్యాపారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు. కొన్ని అదనపు బాధ్యతలు అందుకుంటారు. కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

మీనరాశి: కుటుంబంలో చిన్నపాటి చికాకులను ఎదుర్కొంటారు!

కుటుంబంలో చిన్నపాటి చికాకులను ఎదుర్కొంటారు. తొందరపడి ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలను తీసుకోకూడదు. మిత్రుల శత్రువులుగా మారే అవకాశం ఉంది. ఇతరులు చెప్పిన మాటలకు మీరు మోసపోకండి. కొన్ని ప్రయాణాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశం ఉంది.