Today Horoscope: నవంబర్ 30వ తేదీ బుధవారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి!

కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీ వ్యక్తిగత విషయాలను ఎదుటివారితో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు చేసే వ్యాపారంలో చాలా ఉత్సాహంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

వృషభరాశి: ఉద్యోగంలో అనుకూల వాతావరణం
ఉంటుంది!

పాత మిత్రులను కలుసుకొని కీలక విషయాల గురించి చర్చలు చేస్తారు. చేపట్టిన పనులు ఆశాజకంగా సాగవు. తొందరపడి ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. ప్రారంభించిన పనులను మధ్యలోనే నిలిపివేస్తారు. మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండటమే మంచిది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈరోజు ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

మిధునరాశి: నూతన వాహన యోగం ఉన్నది!

ఉద్యోగంలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం కలుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుండి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఇతరుల నుండి ధన సహాయం అందుతుంది. మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

కర్కాటక రాశి: ముఖ్యమైన వ్యవహారాల్లో అడ్డంకులు తప్పవు!

బయట ఒత్తిడిలు పెరుగుతాయి. ఆరోగ్యం పై మరింత శ్రద్ధ తీసుకోవాలి. ప్రారంభించిన పనులను మధ్యలోనే నిలిపివేస్తారు. ఇతరుల నుండి రావలసిన సొమ్ము సమయానికి తిరిగి రాదు. కుటుంబంలో చిన్నపాటి చికాకులు మొదలవుతాయి. తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.

సింహరాశి: ముఖ్యమైన పనులను వాయిదా వేస్తారు!

చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితాలు కనిపించవు. సోదరులతో ఆస్తికి సంబంధించిన వివాదాలు మరింత చికాకు కలిగిస్తాయి. కుటుంబంలో చిన్నపాటి సమస్యలను ఎదుర్కొంటారు. పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని పనులు వాయిదా వేయాల్సి వస్తుంది.

కన్యరాశి: నూతన వాహనం కొనుగోలు చేస్తారు!

గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలు కలిసి వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజుతో కుదుటపడుతుంది.

తులరాశి: దూర ప్రయాణాలు వాయిదా పడతాయి!

ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. సన్నిహితుల నుండి ధన సహాయం అందుతుంది. కొన్ని దూరపు ప్రాణాలను వాయిదా వేసుకోవడమే మంచిది. ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

వృశ్చికరాశి: ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి!

వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. శ్రమతో కూడిన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థికపరంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది. ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. భూమికి సంబంధించిన విషయాల్లో ఈరోజు మీరు తలదూర్చకుండా ఉండడమే మంచిది. ఇతరులతో వాదనలకు దిగకపోవడం మంచిది.

ధనుస్సురాశి: సహాయం సహకారాలు అందుతాయి!

కుటుంబ సభ్యుల సహాయం సహకారాలు అందుతాయి. మీరు ఏ పని మొదలుపెట్టిన అంతా శుభమే జరుగుతుంది. ఉద్యోగమున మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. స్నేహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కొన్ని విలువైన బహుమతులను కొనుగోలు చేస్తారు. కొన్ని దూరపు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మకరరాశి: మానసిక ప్రశాంతత లోపిస్తుంది!

కుటుంబ సభ్యుల వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఉంటాయి. సన్నిహితుల నుండి ధన సహాయం అందుతుంది. కొన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది. కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

కుంభరాశి: చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు!

కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఉద్యోగంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. కొన్ని పనులలో ఆటంకాలు ఎదురవుతాయి.

మీనరాశి: పెద్దలతో మాట పట్టింపులు ఉంటాయి!

కుటుంబ పెద్దలతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు నిలకడగా రాణించవు. ఉద్యోగంలో వాతావరణం నిరాశ కలిగిస్తుంది. ఇంటా బయట నూతన సమస్యలు కలుగుతాయి. వ్యాపార విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వృత్తి ఉద్యోగమున ఆశించిన ఫలితాలు ఉండవు.