ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఎంతో ప్రత్యేకత ఉంది.. శనివారం ఆగస్టు 9న జరగనున్న ఈ పర్వదినం సందర్భంగా ఆకాశంలో శక్తివంతమైన గ్రహసంయోగం ఏర్పడనుంది. అదే రోజు సూర్యుడు మరియు శనిగ్రహం కలిసి నవపంచమ రాజయోగంను కలగజేస్తున్నాయి. జ్యోతిష్య నిపుణుల ప్రకారం, ఇది అత్యంత శుభకారకం. ఐదు ముఖ్య రాశుల జీవితంలో కీలకమైన మార్పులు చోటుచేసుకుంటాయని చెబుతున్నారు.
నవపంచమ రాజయోగం అంటే, జాతకంలో పంచమ మరియు నవమ స్థానాల్లో శుభగ్రహాలు కలిసినపుడు ఏర్పడే శక్తివంతమైన యోగం. ఇది వ్యక్తికి నూతన శక్తిని, అదృష్టాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని, విజయాన్ని అందించే సమయంగా భావిస్తారు. ఈసారి ఆ యోగం కింది రాశులవారికి విశేష ఫలితాలను అందిస్తాయని పండితులు చెబుతున్నారు.
మేషరాశి: మేషరాశి వారికి గత కొన్ని నెలలుగా ఎదురవుతున్న ఇబ్బందులు నెమ్మదిగా తగ్గుతాయి. శనిగ్రహం వక్రీగా ఉన్నా, సూర్యుడి ప్రభావంతో సమస్యలు తీరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఉన్న ఆందోళనలు తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అకస్మాత్తుగా ఒక మంచి అవకాశంతో ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
మిధునరాశి: మిథునరాశి వారికి ఈ యోగం ఉద్యోగ మార్పులకు, వ్యాపార పురోగతికి దారితీస్తుంది. మద్దతుదారులు కలుగుతారు, ఉన్నతుల ప్రోత్సాహం లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ఇది అనుకూల సమయం. విదేశీ అవకాశాల నుంచి ఆశాజనకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
సింహరాశి: సింహరాశి వారు ఈ కాలంలో పూర్తి స్థాయిలో అదృష్టాన్ని అనుభవిస్తారని పండితులు అంటున్నారు. వ్యాపారంలో విస్తరణ, ఆర్థిక పరంగా మెరుగుదల, కుటుంబ సంతోషం వంటి అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంతకాలంగా ఎదురైన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి.
కన్యారాశి: కన్యారాశి వారికి గృహ నిర్మాణం, స్థిరాస్తి కొనుగోళ్లు వంటి విషయంలో మంచి పరిణామాలు చోటుచేసుకుంటాయి. కుటుంబంతో సంబంధాలు మెరుగవుతాయి. కార్యాలయంలో పై అధికారుల సహకారం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీరు కోరుకున్నదిశగా ప్రయాణిస్తాయి.
మీనరాశి: మీనరాశి వారికి శని కొన్ని అడ్డంకులు కలిగించినా, ఈ యోగం వాటిని తొలగించనుంది. పూర్తి కాకుండా ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. వ్యాపార పరంగా విజయాలు కలుగుతాయి. విదేశాల నుంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత లభిస్తుంది.
ఈ ఏడాది రాఖీ పౌర్ణమి విశిష్టమైన రోజుగా నిలవనుంది. గ్రహస్థితులు మారుతున్నప్పుడే, కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. పై ఐదు రాశులవారు ఈ శుభసమయంలో తమ శ్రేయస్సు కోసం సానుకూల నిర్ణయాలు తీసుకుంటే, జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లే అవుతుంది.
