జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహచారాలు మన జీవితంపై అనేక ప్రభావాలు చూపుతాయి. వాటిలో శనిగ్రహం ప్రభావం ఒక కీలకమైనది. ఇటీవల శని తిరోగమనం చేయడం వల్ల కొన్ని రాశులవారికి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. గతంలో ఎదురైన సమస్యలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ క్రమంగా తగ్గిపోతూ, విజయ పథంలోకి అడుగుపెడుతున్న దశ ఇది. ప్రత్యేకంగా ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు ఈ రాశులవారికి శనిగ్రహం అనుకూలంగా నిలిచే అవకాశం ఉందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. ఆ రాశులు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
ముఖ్యంగా ఈ కాలంలో వృషభ రాశి వారు నూతన జీవన మార్గంలోకి అడుగుపెడతారు. అనుకున్న పనులు సాఫీగా నెరవేరుతాయి. గతంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గి, సంపాదన మార్గాలు విస్తరిస్తాయి. అనూహ్యంగా వ్యాపార లాభాలు లభించటం, కొత్త ఒప్పందాలు రావటం వంటి శుభ ఫలితాలు కనిపించనున్నాయి. కుటుంబ వాతావరణం సానుకూలంగా మారి, అందరి మద్ధతు లభించనుంది.
అలాగే కర్కాటక రాశి వారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా నిలుస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులు, వాయిదా పడిన ఒప్పందాలు ఇప్పుడు నెరవేరే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా పెట్టుబడులకు అనుకూల సమయం కావడంతో, వ్యాపారాల్లో భారీ లాభాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనోబలంతో పాటు మానసిక ఆనందం కూడా పెరిగి, జీవితాన్ని కొత్త కోణంలో ఆస్వాదించే దిశగా సాగుతారు.
మీన రాశి వారు ఈ కాలంలో ఒకరకమైన ఆర్థిక పునరుజ్జీవనాన్ని అనుభవిస్తారు. పెద్ద మొత్తంలో సంపాదన అవకాశాలు తలుపు తట్టనున్నాయి. ఆరోగ్యం మెరుగవడం, కుటుంబంలో అనుబంధాలు గట్టిపడడం, గతంలో అపూర్ణంగా ఉన్న పనులు పూర్తవడం ఈ కాలానికి ప్రత్యేకత. మానసికంగా కూడా చాలా రిలీఫ్ ఫీలవుతూ, లక్ష్యాల దిశగా సమర్థవంతంగా సాగేందుకు ఇది మంచి సమయంగా నిలుస్తుంది.
ఇది మూడు రాశుల వారికి శని అనుగ్రహంతో కూడిన అదృష్టకాలం. ఈ సమయంలో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే, జీవితంలో నూతన శిఖరాలను చేరుకోవడం ఖాయం. శని అనుగ్రహం ఉండగానే ముందడుగు వేస్తే విజయం దిశగా ప్రయాణం ఆపలేరు.
