Today Horoscope: జనవరి 13వ తేదీ శుక్రవారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది!

ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు. భూమికి సంబంధించిన విషయాలు మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. వృత్తి వ్యాపారాలు ఆశించి రీతిలో రాణించవు. రుణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.

వృషభరాశి: వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి!

వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. గతంలో నిలిపివేయబడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

మిధునరాశి: ధన వ్యవహారాలు అంతగా కలిసి రావు!

ధన వ్యవహారాలు అంతగా కలిసి రావు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రారంభించే పనుల్లో మీ సొంత నిర్ణయాలు పనికిరావు. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి. మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

కర్కాటక రాశి: ఇంటా బయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి!

ఇంటా బయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంది. మీ కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా ఉత్సాహంగా ఉంటారు.

సింహరాశి: కొన్ని వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది!

ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. చిన్ననాటి మిత్రులతో పూర్ణక్షేత్రాలు సంప్రదిస్తారు. వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కన్యరాశి: నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి శ్రీకారం చుడతారు!

నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి శ్రీకారం చుడతారు. మిత్రులతో దూరప్రయణాలను సూచనలున్నవి. వృత్తి వ్యాపారానికి సంబంధించిన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. ఇతరుల నుండి మీ సొమ్ము సమయానికి చేతికి అందుతుంది. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

తులరాశి: ప్రారంభించిన పనులను చాలా త్వరగా పూర్తి చేస్తారు!

ప్రారంభించిన పనులను చాలా త్వరగా పూర్తి చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. చాలా సంతోషంగా ఉంటారు.

వృశ్చికరాశి: ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి!

ఆర్థిక పరిస్థితులు నిరుత్సాహపరిస్తాయి. అనారోగ్య సమస్యను అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ఇతరుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకపోవడమే మంచిది. మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

ధనుస్సురాశి: దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది!

దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంత అవసరం. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కొన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చేయడమే మంచిది.

మకరరాశి: వాదనలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది!

వాదనలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వలన విశ్రాంతి దొరకదు. ఇతరుల అవసరానికి సైతం ధన సహాయం చేస్తారు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడం ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

కుంభరాశి: వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి!

వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు. ఇతరుల నుండి ధన సహాయం అందుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. దూరప్రయణాలు చేయాల్సి ఉంటుంది. ప్రయాణంలో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ విషయాలను ఇతరులతో పంచుకోకండి.

మీనరాశి: నూతన పెట్టుబడుల విషయాల్లో ఆలోచనల అవసరం!

నూతన పెట్టుబడు విషయాల్లో ఆలోచనలు అవసరం. ఉద్యోగమున చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ప్రతిఫలం కనిపించదు. సంతాన విద్య విషయాలకు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది