మేషరాశి: దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు!
మీరు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలాటంకాలు తొలగిపోతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలమిస్తాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇతరుల రావలసిన సొమ్ము సమయానికి తిరిగి వస్తుంది. ఇతరుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
వృషభరాశి: నూతన అవకాశాలు లభిస్తాయి!
నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. కొన్ని దూరపు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు కొన్ని ప్రమాదాలు జరిగా అవకాశం ఉంది. కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
మిధునరాశి: ఊహించని వివాదాలు కలుగుతాయి!
ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది తప్పదు. ప్రయాణాలు మార్గ అవరోధాలు కలుగుతాయి. ప్రారంభించే పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి. స్నేహితుల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అనవసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.
కర్కాటక రాశి: నూతన ప్రోత్సహాకాలు అందుతాయి!
నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. సంతాన విద్య విషయాలు అనుకూలంగా అనుకూలిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆరోగ్యపరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రారంభించడం ప్రతిఫలం కనిపించదు. మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
సింహరాశి: వివాదాలు కలుగుతాయి!
దూర బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరుద్యోహ పరుస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో కొద్దిపాటి చికాకులు తప్పవు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది. కొన్ని దూరపు ప్రయాణాల్లోని వాయిదా వేసుకోవడమే మంచిది.
కన్యరాశి: నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు!
నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి. గ్రహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం తలుస్తాయి. విద్యార్థులు ఇతర పనులపై కాకుండా మీ చదువుపై కూడా దృష్టి పెట్టాలి. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు. అనుకోకుండా కొన్ని దూరపు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇతరుల నుండి మొండి బాకీలు వసూలు చేస్తారు.
తులరాశి: వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి!
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇతరులకు సహాయం అందిస్తారు. చేపట్టిన పనుల్లో పురోహిత సాధిస్తారు. మిత్రుల నుండి శుభవార్త అందుతుంది. అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కల్పిస్తుంది. కొన్ని విలువైన బహుమతులను కొనుగోలు చేస్తారు.
వృశ్చికరాశి: వృధా ఖర్చుల విషయాలు ఆలోచనలు చేయాలి!
వృధా ఖర్చుల విషయాలు పునరాలోచన చేయడం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో అవరోధాలు కలుగుతాయి. వ్యాపారాల భాగస్వామితో వివాదాలు కలుగవచ్చు. మీరు చేసే పనిలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. పనికి తగిన ప్రతిఫలం కనిపించదు. తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
ధనుస్సురాశి: నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు!
నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. చేపట్టిన పనుల్లో ఎంత కష్టపడినా ప్రతిఫలం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలు తొందరపాటు పనిచేయదు. దైవ సేవ కార్యక్రమాలు పాల్గొంటారు. వ్యాపారంలో ఉద్యోగాల్లో ఇతరుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదుర్కొంటారు. బయట కొందరి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.
మకరరాశి: దూర ప్రయాణాలు చేస్తారు!
మీ చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. హిందూ వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పురోహితి కలుగుతుంది. బంధు వర్గం నుండి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని దూరపు ప్రయాణాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి.
కుంభరాశి: నూతన వాహనం కొనుగోలు చేస్తారు!
నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులని ఎదుర్కొంటారు. ఆర్థికపరంగా కొంత డబ్బు పొదుపు చేయాల్సి ఉంటుంది. విద్యార్థుల విదేశాల్లో చదవాలనే ఆలోచనలు ఉంటారు. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. మీరంటే గిట్టని వారు మీ విషయాలు తలదూర్చడానికి ప్రయత్నిస్తారు.
మీనరాశి: ప్రారంభించిన పనులను త్వరగా పూర్తి చేస్తారు!
ప్రారంభించిన పనులను త్వరగా పూర్తి చేస్తారు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చర్చలు చేస్తారు. మీ మాటలతో ఇతరుల మనసుని ఆకట్టుకుంటారు. శత్రువులను మిత్రులుగా మార్చే గుణం మీలో ఉంటుంది. భూమికి సంబంధించిన విషయాలలో మీరు జోక్యం చేసుకోకూడదు. మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.