Today Horoscope: డిసెంబర్ 30వ తేదీ శుక్రవారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: ఆర్థిక ఇబ్బందులు చికాకు కలిగిస్తాయి!

ఆర్థిక ఇబ్బందులు చికాకు కలిగిస్తాయి. మీరు చేసే పనుల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి. పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృషభరాశి: మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండాలి!

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండాలి. భూమికి సంబంధించిన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది. తరచు మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు చేసే ఉద్యోగంలో గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వలన విశ్రాంతి దొరకదు. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

మిధునరాశి: స్నేహితుల సహాయంతో వాయిదా పడ్డ పనులను పూర్తి చేస్తారు!

స్నేహితుల సహాయంతో వాయిదా పడ్డ పనులను పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. బంధువుల నుండి ఒక శుభవార్త అందుతుంది. అది మీ మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. కొన్ని దూర ప్రయాణాలు లాభ సాటిగా సాగుతాయి.

కర్కాటక రాశి: మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది!

మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఇతరులకు పై కోపం మీ కుటుంబ సభ్యులపై చూపిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది. కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది. మీ స్నేహితులతో కలిసి విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

సింహరాశి: నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు!

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరుల నుండి రావాల్సిన సొమ్ము సమయానికి చేతికి అందుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొన్ని దూర ప్రాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు అంతా మంచే జరుగుతుంది.

కన్యరాశి: పెట్టుబడి విషయాల్లో జాగ్రత్త అవసరం!

వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడి విషయాలు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది. మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కొన్ని దూర ప్రయాణాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

తులరాశి: తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు!

తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురైయ్యే అవకాశం ఉంది. భూమికి సంబంధించిన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు. ఇతరులతో వాదనలకు దిగే అవకాశం ఉంది. స్నేహితులతో కలిసి దూరప్రాణాలు చేయాల్సి ఉంటుంది. ప్రయాణం చేసేటప్పుడు మిగిలిన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

వృశ్చికరాశి: నిరుద్యోగుల ఆశలు పలిస్తాయి!

నిరుద్యోగుల ఆశలు పలిస్తాయి. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన పనులను సకలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. చిన్ననాటి
మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. వ్యాపారాల్లో లాభాలు అందుతాయి.

ధనుస్సురాశి: వ్యాపార వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి!

వ్యాపార వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయట నూతన ప్రోత్సాహారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.

మకరరాశి: దూరప్రాణాలు చేయాల్సి వస్తుంది!

దూరప్రాణాలు చేయాల్సి వస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి. భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. చాలా సంతోషంగా ఉంటారు.

కుంభరాశి: సంతానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి!

సంతానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది. మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలను తీసుకోకూడదు. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చ చేస్తారు. ప్రారంభించిన పనులను వాయిదా వేయాలి.

మీనరాశి: మీరు చేసే పనుల్లో కొన్ని మార్పులను ఎదుర్కొంటారు!

మీరు చేసే పనుల్లో కొన్ని మార్పులు ఎదుర్కొంటారు. గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడమని మంచిది. ఇతరుల విషయాలు మీరు జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు