Today Horoscope : ఫిబ్రవరి 6th శనివారం మీ రాశి ఫలాలు

today february 6th 2021 daily horoscope in telugu

మేష రాశి : వ్యాపారాలు సాఫీగా సాగుతాయి !

ఈరోజు సన్నిహితుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఈరోజు కుటుంబ సభ్యుల ఆరోగ్యం జాగ్రత్త. ముఖ్యసమాచారం అందుతుంది. పేద ప్రజలకు ఆహారపదార్థాలు దానం చేయండి.

వృషభ రాశి: ఉద్యోగాలలో నూతనోత్సాహం !

ఈరోజు పలుకుబడి పెరుగుతుంది. యత్నకార్యసిద్ధి. ఈరోజు పనులు కష్టతరంగా ఉన్నప్పటికీ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు ఉద్యోగాలలో నూతనోత్సాహం. శ్రీరామ రక్షాస్తోత్రం పారాయణం మంచి ఫలితాన్నిస్తుంది.

మిధున రాశి: ఈరోజు కష్టపడాల్సి ఉంటుంది !

ఈరోజు కుటుంబ సమస్యలను తోబుట్టువులు పరిష్కరిస్తారు. పనుల్లో జాప్యం. విద్యార్థులు ఉన్నత లక్ష్యాల కోసం మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి కొంత నిరాశాజనకంగా ఉంటుంది. ఈరోజు ఆఫీసులో ప్రయోజనాలు చేకూరతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఇష్టదేవతరాధన చేయండి.

కర్కాటక రాశి: ఈరోజు బిజీగా గడుపుతారు !

ఈరోజు ప్రయాణాలలో మార్పులు. ఎదురుచూస్తున్న శుభవార్త ఈరోజు అందుతుంది. రుణాలు చేస్తారు. మీరు మీ భాగస్వామితో బిజీగా గడుపుతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఈరోజు కుటుంబంలో ఏదైనా కీలకమైన పనులను మీరు చేపట్టే అవకాశం ఉంది. శ్రీలక్ష్మీ ఆరాధన చేయండి.

సింహ రాశి: పోటీ పరీక్షల్లో విజయం !

ఈరోజు సామాజికంగా మీకు తగిన గుర్తింపు లభిస్తుంది. శుభవార్తలు వింటారు. ఈరోజు పోటీ పరీక్షల్లో విజయం. ఈరోజు రావలసిన డబ్బులు సమయానికి అందవు. వ్యవహారాలలో విజయం. రుణాలు ఇవ్వకండి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆర్థికాభివృద్ధి. సూర్యాస్తమయం సమయంలో సూర్య నమస్కారం, ప్రార్థన చేయండి.

today february 6th 2021 daily horoscope in telugu
today february 6th 2021 daily horoscope in telugu

కన్య రాశి: ఈరోజు పనితీరులో మార్పులు !

ఈరోజు కొన్ని పరిస్థితులు అనుకూలించవు.మీరు చేపట్టే సామాజిక కార్యక్రమాలు మీకు మంచి గుర్తింపును తెచ్చి పెడతాయి. బంధువులతో మాటపట్టింపులు. ఈరోజు మీ పనితీరులో మార్పులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కాలభైరవాష్టకం ఉదయాన చదవండి.

తులా రాశి: ఈరోజు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి !

ఈరోజు మీ కష్టం వృధాగా పోదు. వ్యాపారాల్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.మీ జీవిత భాగస్వామితో ఈరోజు సంతోషంగా గడుపుతారు. ఆర్థిక లాభాలు. ఈరోజు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. శ్రీలక్ష్మీనారాయణ పూజలు చేయండి.

వృశ్చిక రాశి: ఈరోజు ప్రయాణాలు వాయిదా !

ఈరోజు చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఈరోజు మీ వైవాహిక బంధం బలపడుతుంది. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రీలక్ష్మీదేవిని ఆరాధించండి.

ధనుస్సు రాశి: సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు !

ఈరోజు పలుకుబడి పెరుగుతుంది. కొత్త వ్యక్తులను కలుస్తారు, వారు మీకు భవిష్యత్లో సాయం చేస్తారు. ఈరోజు సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. కెరీర్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగాలు ఉత్సాహంగా కొనసాగుతాయి. జ్యోతిర్లింగాల శ్లోకాలను పారాయణం చేయండి.

మకర రాశి: ఈరోజు ఉద్యోగాలలో పురోభివృద్ధి !

ఈరోజు పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఈరోజు సంతోషంగా గడుపుతారు. మీ కుటుంబంతో కూర్చుని భవిష్యత్ గురించిన చర్చలు జరుపుతారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి. ఈరోజు మీపై మీరు నమ్మకం ఉంచుకుని పని చేయండి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

కుంభ రాశి: ఈరోజు కష్టానికి తగిన గుర్తింపు !

ఈరోజు వ్యాపారంలో వస్తున్న లాభాలు మీ కష్టానికి తగిన గుర్తింపుని ఇస్తాయి. వ్యవహారాలలో అవాంతరాలు. తల్లితో విబేధాల వలన వచ్చే ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు బంధువులతో తగాదాలు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. రాబోయే రోజులు మంచిగా గడుస్తాయి. ఈరోజు ఉద్యోగాలలో చిక్కులు. శ్రీలలితా పంచదశి స్తోత్రం చదవండి.

మీన రాశి: వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు !

ఈరోజు కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఈరోజు శుభప్రదంగా గడుస్తుంది. మీకు అకస్మాత్తుగా ఎక్కడ నుంచి అయినా సంపద లభిస్తుంది. దూరప్రయాణాలు. మీ సమస్యలను మీరే పరిష్కరించుకోండి. ఈరోజు వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు. మీ పనుల కోసం ఇతరులపై ఆధార పడకండి. సప్తముఖి రుద్రాక్ష ధరించండి.