Today Horoscope : ఫిబ్రవరి 3rd బుధవారం మీ రాశి ఫ‌లాలు

today february 3rd 2021 daily horoscope in telugu

మేష రాశి : మిత్రుల నుంచి శుభవార్తలు !

ఈరోజు వివాదాలు పరిష్కరించుకుంటారు.ఈరోజు చాలా ప్రత్యేకంగా గడుస్తుంది. కార్యాలయంలోని మీ సహోద్యోగులు మీకు సాయం చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఈరోజు అనుకున్న పనులన్నీ అనుకున్నట్లు పూర్తి అయిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతారు. ఈరోజు ఉద్యోగాలు అనుకూలస్థితిలో ఉంటాయి. గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృషభ రాశి: ఆలయాలు సందర్శిస్తారు !

ఈరోజు వ్యతిరేకుల నుంచి ఒత్తిడులు. ఈరోజు అన్ని పనులు పూర్తి చేసేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. సాయంత్రం సమయంలో విశ్రాంతిగా ఉంటారు. ఈరోజు ఎవరిని అతిగా విశ్వసించవద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి.

మిధున రాశి: ఈరోజు కుటుంబంలో ఒడిదుడుకులు !

ఈరోజు పనుల్లో గందరగోళం.ఈరోజు ఆర్ధిక సంబంధ నిర్ణయాలు తీసుకుంటే మీకు కలిసి వస్తుంది. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. కుటుంబంలో ఒడిదుడుకులు. ఈరోజు వ్యాపారాలు నత్తనడకనగా సాగుతాయి. శ్రీ రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి :  పలుకుబడి పెరుగుతుంది !

ఈరోజు కొత్త పనులు చేపడతారు.ఈరోజంతా బిజీ బిజీగా గడిపేస్తారు. కొత్త నిబంధనలను విధించుకుంటారు. ఈరోజు పలుకుబడి పెరుగుతుంది. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు వ్యాపారాలు,ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తీరతాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

సింహ రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు !

ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు పూర్తి మద్దతు ఇస్తారు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఈరోజు అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు శ్రీ భ్రమరాంబికాష్టకము పారాయణం చేసుకోండి.

కన్య రాశి: ఆహ్వానాలు అందుతాయి !

ఈరోజు ఆహ్వానాలు అందుతాయి.ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ సృజనాత్మకతను వినియోగించి పని పై దృష్టి పెట్టండి. ఈరోజు బాకీలు వసూలవుతాయి. మీ స్నేహితుడికి సాయం చేస్తారు. ఈరోజు పనులు చకచకా సాగుతాయి. శ్రీ వెంకటేశ్వర గోవింద నామ స్మరణం పారాయణం చేసుకోండి.

తుల రాశి: ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది !

ఈరోజు వ్యవహారాలలో అవాంతరాలు. ఆఫీసులో మీకు అందరు సహకరిస్తారు. ఈరోజు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. మీ పనులన్నీ పూర్తవుతాయి. ఈరోజు ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి. ఈరోజు కాలభైరవాష్టకం పారాయణం చేసుకోండి, పేదవారికి రొట్టెను దానం చేసుకోండి.

today february 3rd 2021 daily horoscope in telugu
today february 3rd 2021 daily horoscope in telugu

వృశ్చిక రాశి: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి !

ఈరోజు వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఈరోజు గొడవలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఈరోజు రుణ విమోచన గణపతి స్తోత్రం పారాయణం చేసుకోండి, దగ్గర్లో ఉన్న గణపతిని ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోండి.

ధనుస్సు రాశి: ఈరోజు పనులు సకాలంలో పూర్తి !

ఈరోజు నూతన ఉద్యోగాలు లభిస్తాయి. మీ కార్యాలయంలో కూడా బిజీగా గడుపుతారు. సమయాన్ని ఆదా చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ శక్తీ సామర్ధ్యాలపై నమ్మకం ఉంచి పనిచేయండి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. శివ అష్టకం పారాయణం చేసుకోండి.

మకర రాశి: పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు !

ఈరోజు వ్యవహారాలలో ఆటంకాలు.ఈరోజు చాలా బిజీగా ఉంటారు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఈరోజు ఆటంకాలు ఎదురైనా పనులను మాత్రం సమయానికి పూర్తి చేసేసుకుంటారు. ఈరోజు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చట్ట పరమైన విషయాల్లో ఈరోజు మీకు విజయం లభిస్తుంది. చంద్రశేఖర అష్టకం పారాయణం చేసుకోండి.

కుంభ రాశి: ఈరోజు కొత్త వ్యక్తులతో పరిచయాలు !

ఈరోజు ఆలోచనలు స్థిరంగా సాగవు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పనులు వాయిదా వేస్తారు. ఈరోజు వ్యాపారంలో ఒప్పందాలు కుదురుతాయి. మీ ఉద్యోగంలో కొంత పురోగతి ని సాధిస్తారు. ఈరోజు వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఈరోజు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి.

మీన రాశి: సమస్యల నుంచి బయటపడతారు !

ఈరోజు పరిస్థితులు అనుకూలిస్తాయి.కార్యాలయాల్లో మీరు తెలివిగా పని చేయాల్సి ఉంటుంది. ఈరోజు సమస్యల నుంచి బయటపడతారు. వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. అనేక అడ్డంకులను ఎదుర్కొంటారు. ఈరోజు సంఘంలో ఆదరణ. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే విషయాలను వాయిదా వేయడం మంచిది. అన్నపూర్ణ అష్టకం పారాయణం చేసుకోండి.