Today Horoscope : ఫిబ్రవరి 24th బుధవారం మీ రాశి ఫలాలు

today February 24th 2021 daily horoscope in telugu

మేష రాశి: కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత విద్యలకు అర్హులు అవుతారు. రావలసిన మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన లాభం పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉండారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. ప్రయాణాలకు అనుకూలం. భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

వృషభ రాశి : తీర్థయాత్రలు చేస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉంటారు. ధన లాభం పొందుతారు. ప్రయాణాలకు అనుకూలం. తీర్థయాత్రలు చేస్తారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. కొత్త వ్యాపారాలను ప్రారంభించడం వల్ల లాభాలు కలుగుతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు చేసుకుంటారు. గృహంలో శుభకార్యాన్ని తలపెడతారు. వివాహాది నిశ్చయ తాంబూలాలు అనుకూలిస్తాయి.కనకధారా స్తోత్ర పారాయణం చేసుకొంది.

మిధున రాశి: తీర్థయాత్రలు చేస్తారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. స్నేహితులతో ఆనందంగా ఉంటారు. ప్రయాణాలు చేయడానికి అనుకూలం. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. గతంలో పోగొట్టుకున్న డబ్బులను, వస్తువులను తిరిగి పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. వ్యాపారాలను విస్తరించుకొని అధిక లాభాలు పొందుతారు. అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి : కార్యసిద్ధి పొందుతారు !

ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. తక్కువ మాట్లాడడం మంచిది. అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి పొందుతారు. అనుకున్న పనులను సరైన సమయానికి పూర్తి చేయడం వల కార్యసిద్ధి పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వలన అనారోగ్యానికి దూరంగా ఉంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. గ్రహ స్థలాన్ని కొనుగోలు చేస్తారు.ఈరోజు దుర్గాదేవిని ఆరాధించండి..

సింహరాశి: వాహన ప్రమాదాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. తొందరపడి మాట్లాడటం వల్ల నష్టం జరుగుతుంది. సోదర సోదరీమణులతో వివాదాలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

కన్యారాశి: వ్యాపారాల్లో లాభాలు !

ఈరోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. రుణ విమోచనలు కలుగుతాయి. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. ప్రయాణాలకు అనుకూలం. వివాహా సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. నూతన గ్రహాన్ని కొనుగోలు చేస్తారు. సోదరులతో సఖ్యతగా ఉంటారు.శివ అష్టకం పారాయణం చేసుకోండి.

today February 24th 2021 daily horoscope in telugu

తులారాశి: పేరు ప్రఖ్యాతులు పొందుతారు !

ఈరోజు ఆనందంగా ఉంటుంది. చేసిన తప్పులను సరిదిద్దు కుంటారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో ఉన్నతశ్రేణి మార్కులు పొందుతారు. పెద్ద వారిని గౌరవిస్తారు, వారి సూచనలను పాటిస్తారు. వ్యాపారాల్లో సమయస్ఫూర్తిగా పెట్టుబడులు పెట్టడం వలన లాభాలు కలుగుతాయి. భార్యాభర్తలు సఖ్యతగా, ఆనందంగా ఉంటారు. అనారోగ్యాలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. కార్యాలయాల్లో పేరు ప్రఖ్యాతులు పొందుతారు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు.ఈరోజు లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి: ఖర్చులకు దూరంగా ఉంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. ధన యోగం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. దైవ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు.ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి: కార్యాలయాల్లో ప్రమోషన్లు !

ఈరోజు బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. ప్రయాణాలకు అనుకూలం. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉంటారు. గొప్ప వ్యక్తుల పరిచయాలు లాభాలు కలిగిస్తాయి. వ్యాపారాల్లో అధిక లాభాలు కలుగుతాయి. మొండి బకాయిలను వసూలు వేసుకోవడం వల ధన వృద్ధి కలుగుతుంది. శివాష్టక పారాయణం చేసుకోండి.

మకర రాశి: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం !

ఈరోజు ఆనందంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీ పరీక్షల్లో ఉన్నతశ్రేణి మార్కులు పొందుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. అప్పుల బాధలు. ధనవృద్ధి పెరుగుతుంది. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పదోన్నతులు కలుగుతాయి.కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

కుంభరాశి: శుభవార్తలు వింటారు !

ఈరోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహంలో వేడుక జరుపుతారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. విద్యార్థులు కష్టపడి చదువు కొన్ని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు. కార్యాలయాల్లో గొప్ప పదోన్నతులు పొందుతారు. రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకొండి.

మీన రాశి: ఆరోగ్యంగా ఉంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన డబ్బులు సమయానికి చేతికి అందుతాయి. ధన లాభం కలుగుతుంది. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. కొత్త వ్యాపారాలను ప్రారంభించడం వలన అధిక లాభాలు కలుగుతాయి. అనారోగ్యాలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకొండి.