Today Horoscope : ఫిబ్రవరి 12th శుక్రవారం మీ రాశి ఫలాలు

today february 12th 2021 daily horoscope in telugu

మేష రాశి : ఉద్యోగాలు అనుకూలిస్తాయి !

ఈరోజంతా క్షణం తీరిక లేకుండా గడిచిపోతుంది. కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. వస్తులాభాలు. పనిని ఇష్టంగా చేయండి. ఎన్ని పనులున్నా, ఆటంకాలు ఎదురవుతున్న సమర్ధవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. సమాజం లో మీకు గౌరవం లభిస్తుంది. శ్రీసూక్తపారాయణం లేదా శ్రవణం చేయండి.

వృషభ రాశి: కుటుంబంలో ఒత్తిడులు !

సన్నిహితులతో విభేదాలు. కుటుంబంలో ఒత్తిడులు. మీ కుమార్తె, లేదా కుమారుడు వివాహం గురించి ఆలోచనలు చేస్తారు. ఉద్యోగాలలో చికాకులు. పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నా సమర్ధ వంతంగా నిర్వహిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. శ్రీకనకదుర్గా ఆరాధన చేయండి.

మిధున రాశి: పనుల్లో అవాంతరాలు !

ఈరోజు పనుల్లో అవాంతరాలు. అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. మీ కుటుంబంలోని పెద్దవారితో చర్చించవద్దు. మిత్రులతో విభేదిస్తారు. ‘‘ఓం నమః చండికాయేనమః’’ అనే మంత్రాన్ని పారాయణం చేయండి.

కర్కాటక రాశి: వ్యాపారాలలో లాభాలు !

ఈరోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార రంగం వారికి బాగుంటుంది. ఈరోజు జీవిత భాగస్వామి సహకరిస్తారు. ఈరోజు అనుకోని విధంగా డబ్బు అందుతుంది. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. శ్రీదుర్గాదేవి ఆరాధన, పారాయణం చేయండి.

today february 12th 2021 daily horoscope in telugu

సింహ రాశి: ముఖ్యమైన పనులలో విజయం !

ఈరోజు ఆనందంగా గడుస్తుంది. ముఖ్యమైన పనులలో విజయం. మీకు ఇష్టమైన వారితో సంతోషగా కాలం గడుపుతారు. శుభవార్తలు వింటారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ఆటంకాలు ఎదురవుతున్న పనులను పూర్తి చేయడానికి సిద్ధపడతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. సరస్వతీదేవిని ఆరాధించండి.

కన్య రాశి: సన్నిహితులు మద్దతు ఇస్తారు !

ఈరోజు పరోపకారం చేయడంలో ముందుంటారు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఈరోజు మీకు కలిసి వస్తుంది. కుటుంబంలో కొన్ని చికాకులు. ఆలయ దర్శనాలు. ఈరోజు మీ సన్నిహితులు మీకు మద్దతు ఇస్తారు. ఇష్టదేవతరాధన చేయండి.

తులా రాశి: ఉద్యోగాలలో వివాదాలు !

ఈరోజు కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు.ఈరోజు మనసులో సంతృప్తి కరంగా ఉంటుంది. మీ సన్నిహితుల సలహాలు, మద్దతుతో మీరు పూర్తి చేయాల్సిన పనులను సరైన క్రమంలో పూర్తి చేస్తారు. ఇంటాబయటా చికాకులు. భార్య పిల్లలతో సంతోషకరం సమయం గడుపుతారు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు. దూరప్రయాణాలు. కుజగ్రహారాధన చేయండి.

వృశ్చిక రాశి: ఈరోజు విభేదాలు పరిష్కారం !

ఈరోజు ఆనందంగా గడుస్తుంది. శుభవార్తలు వింటారు. మీకు సంపద, ఉల్లాసం లభిస్తుంది. ఈరోజు ప్రత్యేకమైన సహకారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిపుణుల సలహాల వలన మీరు మీ పనిని త్వరగా పూర్తి చేయగలుగుతారు. సన్నిహితులతో విభేదాలు పరిష్కారం. మీ స్నేహితుడు మిమ్మల్ని అవసరానికి ఆడుకుంటారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం. శ్రీ శివకవచం వినండి లేదా చదవండి.

ధనుస్సు రాశి: ప్రయాణాలు వాయిదా !

పనుల్లో ప్రతిబంధకాలు. శుభప్రదంగా గడుస్తుంది. మీకు అకస్మాత్తుగా సంపద లభిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేస్తారు. మీ సమస్యలను మీరే పరిష్కరించుకోండి. శ్రమాధిక్యం. మీ పనుల కోసం ఇతరులపై ఆధార పడకండి. ఆలయ దర్శనాలు. నుదుటి మీద తెలుపు గంధాన్ని పెట్టుకోండి.

మకర రాశి: ప్రముఖులతో పరిచయాలు !

ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. ధనలాభం. ప్రశంసలు పొందుతారు. వ్యాపారం పై దృష్టిని ఉంచండి. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆస్తిలాభ సూచనలు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపండి. అనవసర గొడవల్లో తల దూర్చవద్దు. ఈరోజు ప్రముఖులతో పరిచయాలు. అవసరమైన ప్రజలకు ఎరుపు కాయధాన్యాలు ఇవ్వండి.

కుంభ రాశి: పనులను పూర్తి చేస్తారు !

ఈరోజు వ్యవహారాలలో ఆటంకాలు. స్థిరాస్తి వివాదాలు. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్న పట్టు విడవకుండా పనులను పూర్తి చేస్తారు. వ్యాపారాలు చికాకు పరుస్తాయి. మీ పట్టుదలే మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతుంది. ఈరోజు కొత్త రుణయత్నాలు. శ్రీరామ ఆరాధన చేయండి.

మీన రాశి: సమస్యలను పరిష్కరించుకుంటారు !

ఈరోజు ఆత్మీయుల నుంచి ముఖ్య విషయాలు తెలుస్తాయి.మీ కోరికలను నెరవేర్చుకోగలరు. ఈరోజు సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఈరోజు మనసులో విచారం మాయం అవుతుంది. ఉద్యోగాలలో అనుకూలత. కుటుంబ సభ్యులతో ఉల్లసముగా గడుపుతారు. ఇష్ట దేవతరాధన చేయండి.