మేషరాశి : ఆదాయ మార్గాలు పుట్టు కొస్తాయి!
ఈరోజు మీకు తెలిసిన వారిద్వారా, క్రొత్త ఆదాయ మార్గాలు పుట్టు కొస్తాయి. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు, మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఆఫీస్‌లో పై అధికారుల నుంచి మీకు ప్రశంసలు రావచ్చు. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం కార్తీకమాస ఉపవాసాన్ని పాటించండి.
వృషభరాశి :ఈరోజు అనవసర ఖర్చులు చేయకండి !
ఈరోజు అనవసర ఖర్చులు చేయకండి. సంతానం చదవు కోసం మీరు ధనాన్ని వెచ్చిస్తారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని కేటాయించండి. ఈ రోజు హాజరయే సోషల్ గెట్ టుగెదర్‌లో మీరు లైమ్‌లైట్‌లో ఉంటారు. ఈరోజు మీరు ఖాళీ సమయములో సమస్యలకు తగినపరిష్కారం ఆలోచిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో కన్పిస్తారు. ఈరోజు మీరుకొద్దిగా ప్రయత్నిస్తే మంచి రోజుగా ఉంటుంది. మీ ఆదాయాన్ని మెరుగుపరచడానికి శ్రీలక్ష్మీదేవిని కనకాబంరాలు లేదా ఎర్రమందారాలతో అర్చన చేయండి.
మిథున రాశి : మీ ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది !
ఈరోజు అనుకూల ఫలితాలు. మీ ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. పాత బకాయిలు వసూలు అవుతాయి. మీరు చెల్లించాల్సిన అప్పులు చెల్లిస్తారు. ప్రయాణాలు అంత అనుకూలం కాదు. తప్పనిసరి అయితేనే చేయండి. మీ వైవాహిక జీవితంలో ఈ రోజు మీకో అందమైన రోజు. ఇంట్లో అగరవత్తి వెలిగించడం, కుటుంబ జీవితం కోసం మంచిది.
కర్కాటకరాశి :కోపతాపాలకు దూరంగా ఉండండి !
ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. కోపతాపాలకు దూరంగా ఉండండి. తీవ్ర కోపం వివాదాలకి తగువులకు దారితీస్తుంది. ఈరోజు అనుకోని మార్గాలద్వారా ధనాన్ని పొందుతారు. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. ఇంట్లోవారి సమస్యలను మీరు పట్టించుకుంటారు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు ఓ చక్కని సర్ ప్రైజ్ ఇస్తుంది. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం ఆహార పదార్థాలను పంపిణీ చేయండి.
సింహరాశి :జీవితం చక్కని మలుపు తిరుగుతుంది !
ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు, ట్రేడ్వర్గాల వారికి లాభాలు రావటం వలన ఆనందం వెల్లివిరుస్తుంది. బంధువులను చూడడానికి వెళ్ళిన మీకు మీకు ఆనందం కలుగుతుంది. చాలా సాధారణమైన రోజుల తర్వాత ఈ రోజు మీరు, మీ జీవిత భాగస్వామితో అద్భుతంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది. అదికూడా ఎప్పటికీ చెదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది. మీ పని సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కాలభైర వాష్టకం చదవండి.
కన్యారాశి :పని చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి !
ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఇంట్లో పని చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. మీరు ధనాన్ని పొదుపుచేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది. ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేస్తారు. ఇంట్లో పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వ్యక్తిగత బంధుత్వాల విషయంలో చాలా జాగ్రత్త. అనవసర పనుల కోసం మీరు సమయాన్ని వృధాచేస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్యం విషయంలో బాగా పట్టింపుగా ఉండవచ్చు. మంచి ఆరోగ్యానికి పొందడానికి శ్రీశివాభిషేకం చేయించండి.
తులారాశి :పెద్దల సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి !
ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు, పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గరవారి సలహాలు మీకు ఆర్ధికంగా ప్రయోజనాలను చేకూరు తుంది. పెద్దల సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. ఎవరైతే తీరికలే కుండా గడుపుతున్నారో వారికి ఈరోజు ఫ్రీ సమయం దొరుకుతుంది. ఈరోజు మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబంలో మంచి వాతావరణాన్ని పెంపొందించుటకు మీరు ఈరోజు మీమనస్సును నిగ్రహించుకుంటారు. అనుకూల శుభఫలితాల కోసం శ్రీవిష్ణుసహస్రనామాలను పారాయణం చేయండి.
వృశ్చికరాశి :మీ ఆరోగ్యం మాత్రం బాగానే ఉంటుంది !
ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. మీ ఆరోగ్యం మాత్రం బాగానే ఉంటుంది. ఆర్థికంగా మీకు అనుకూలంగా ఉండదు. కాబట్టి మీ ధనము జాగ్రత్త ఖర్చు చేయండి. కుటుంబ సభ్యులతో సామరస్యంగా ఉండండి. వాదనలకు దిగకండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.దేవాలయ దర్శనానికి అవకాశం ఉంది. దీనివలన మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి పెట్టే ఇబ్బంది వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. శివుడికి తేనెతో అభిషేకం చేయించండి. అంతా సజావుగా సాగుతుంది.
ధనుస్సురాశి :ఈరోజు మిశ్రమంగా ఉంటుంది !
ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. వత్తిడి, అభిప్రాయ భేదాలు మిమ్మల్ని తీవ్ర కోపానికి, అసౌకర్యానికి గురిచేస్తాయి. ఈరోజు అనేక ఆర్ధికసమస్యల నుండి ఉపశమనం పొందుతారు. మంచి అనుకూలమైన కుటుంబ వాతావరణాన్ని పొందడానికి మీరు కోపాన్ని అధిగమించాలి. దూరప్రాంతంనుండి ఒక శుభవార్త అందే అవకాశం ఉంది. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో చికాకులు, సమస్యలు రావచ్చు. ఓపికతో ప్రవర్తించండి. అనారోగ్యాల నుంచి దూరం కావడా నికి సూర్యారాధన చేయండి.
మకరరాశి :ఆర్థిక విషయాలలో తగిన జాగ్రత్త తీసుకోండి !
ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కొన్ని విషయాలు మాత్రం మీకు తెలియకుండానే సాగిపోతాయి. ఆర్థిక విషయాలలో తగిన జాగ్రత్త తీసుకోండి. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. పిల్లలు మీకు కోపం తెప్పించవచ్చు, అయినా మీరు నిగ్రహం కోల్పోకుండా ఉండండి. బంధువులతో గొడవలు జరిగే అవకాశం, కాబట్టి వివాదాలకు తావివ్వకండి. మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తెచ్చిపెట్టేందుకు ఎవరో ప్రయత్నించవచ్చు. కానీ మీరిద్దరూ ఏదోలా సర్దుబాటు చేసుకుంటారు. గొప్ప ఆరోగ్య ప్రయోజనాల కోసం శివుడికి ప్రదక్షణలు, అభిషేకం చేయండి.
కుంభరాశి :మీకు ప్రయోజనం కలుగుతుంది !
మీభావనలపై మీరు నియంత్రణ చేయాలి. వ్యాపారాల్లో లాభాలు ఎలాపొందాలి అని మీ ఆప్త స్నేహితుడు సలహాలు ఇస్తారు. మీరు వారి సలహాలను పాటించినట్లయితే మీకు ప్రయోజనం కలుగుతుంది. మీరు ఆఫీస్‌లో ప్రశంసలు పొందుతారు. పై అధికారుల ద్వారా మద్దతు పొందుతారు. ఈరోజు మీకు అంతామంచిగా ఉంటుంది. కలసివస్తుంది. గృహస్థ జీవితం ప్రశాంతంగాను, ప్రశంసార్హం గానూ ఉంటుంది. అద్భుతమైన ఆరోగ్యం కోసం పేదలకు సహాయం, ఆహారం అందించండి.
మీనరాశి :ఈరోజు మీకు తోచినట్లు చేయండి !
ఈరోజు మిశ్రమమైన ఫలితాలు వస్తాయి. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కానీ ఖర్చులు కూడా పెరగడం వల్ల కొన్ని స్వల్ప ఇబ్బందులు పడుతారు. ఆర్థిక సంబంధమైన విషయాలలో ఎవరి పాటించకండి. మీకు తోచినట్లు చేయండి. కుటుంబంలో ఈరోజు ఒకరు అసౌకర్యమైన, ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు. విజయం కోసం కలలుకనడం తప్పుకాదు. కానీ దానికోసం శ్రమంచడం ఈరోజు నుంచి తప్పక ప్రారంభించండి. వైవాహిక జీవితం సాఫీగా, సంతోషంగా సాగుతుంది. కుటుంబం ఆనందం పొందడానికి అమ్మవారిని ఎరుపురంగు పుష్పాలతో ఆరాధన చేయండి.