Today Horoscope : ఫిబ్రవరి 13th శనివారం మీ రాశి ఫలాలు

Horoscope today february 13th 2021 daily horoscope in telugu

మేష రాశి : ఈరోజు మిత్రులను కలుసుకుంటారు !

ఈరోజు సానుకూలంగా గడుస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. నూతన పథకాలపై దృష్టి పెడతారు. ఈరోజు మీ భాగస్వామి సహకరిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. చట్టపరమైన వివాదాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోండి.

వృషభ రాశి: అనుకున్నది సాధించగలుగుతారు !

ఈరోజు బంధువుల నుంచి ఒత్తిడులు. ఉద్రిక్తతలకు తావు ఇవ్వకండి. ఈరోజు ఉద్యోగాలలో నిరాశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు కొన్ని అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చివరకు అనుకున్నది సాధించగలుగుతారు. వ్యయప్రయాసలు. శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

మిధున రాశి: శ్రమపడ్డా ఫలితం కనిపించదు !

ఈరోజు పని వాతావరణం మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో ఒత్తిడులు. పనులు వాయిదా వేస్తారు. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలలో నిరుత్సాహం. దక్షిణామూర్తి స్వామి ఆరాధన చేసుకోండి.

కర్కాటక రాశి: వ్యాపారాలలో పురోగతి !

ఈరోజు శుభకార్యాలకు హాజరవుతారు.కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మీ జీవితభాగస్వామితో సంబంధాలు బాగుంటాయి. ఈరోజు సంఘంలో గౌరవం పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకొండి.

Horoscope today february 13th 2021 daily horoscope in telugu

సింహ రాశి: ఆస్తి వివాదాల పరిష్కారం !

ఈరోజు వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు అనుకూల కాలం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితుల మద్దతు ఉంటుంది. ఈరోజు ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. శుభవార్తలు వింటారు. భ్రమరాంబిక అష్టకం పారాయణం చేసుకోండి.

కన్య రాశి: ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది !

ఈరోజు బంధువులతో వివాదాలు.ఈరోజు మధ్యస్థంగా గడుస్తుంటుంది. ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉంటుంది. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు ఉద్యోగాలలో నిరుత్సాహం. అభివృద్ధి అంతగా జరగదు. శ్రీ లలితా పారాయణం చేసుకోండి.

తుల రాశి: ఈరోజు విజయం సాధిస్తారు !

పనులు వాయిదా వేస్తారు. మీ తమ్ముడి సలహాతో వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. సవాళ్ళను ఎదుర్కొంటారు.ఆరోగ్యభంగం. అన్నిపనుల్లోనూ విజయం సాధిస్తారు. దుర్గా దేవి ఆరాధన చేసుకోండి.

వృశ్చిక రాశి: ఈరోజు ఒత్తిడి తగ్గుతుంది !

ఇంటబయటా సమస్యలు అంతమవుతున్నాయి. పరిచయాలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఉన్నత విద్యకు మార్గంసుగమం అవుతుంది. సంఘంలో ఆదరణ. ఈరోజు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగాలలో ప్రోత్సాహం. లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేసుకోండి.

ధనుస్సు రాశి: ప్రయాణాలు వాయిదా !

కొత్తగా రుణాలు చేస్తారు.మీ ఆలోచనలు సానుకూల ఫలితాలను తీసుకువస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. మీ కుటుంబంతో ఉన్నసత్సంబంధాలు ఉపశమనం కలిగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారంలో సోదర సోదరీమణులు సహకారం అందిస్తారు. పనుల్లో జాప్యం. కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకర రాశి: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి !

ఈరోజు ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. అసంపూర్ణంగా ఉన్నపనులను పూర్తిచేయడానికి అవకాశం ఉంటుంది. సోదరులు, సోదరీల నుంచి శుభవార్తలు. మీ తండ్రి మార్గదర్శకత్వంలో రాణిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. కుటుంబ సంపదను, పేరు ప్రతిష్టలను పెంచుతారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

కుంభ రాశి: బాధ్యతలు పెరుగుతాయి !

ఈరోజు బంధువులతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. మీ నూతన వ్యాపార భాగస్వాములు మీకు లాభం కలిగిస్తారు. ఈరోజు బాధ్యతలు పెరుగుతాయి. శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

మీన రాశి: పనులు సకాలంలో పూర్తి చేస్తారు !

ఈరోజు చిన్ననాటి మిత్రుల కలయిక. ప్రయాణాల్లో జాగ్రత్త. విందు వినోదాలు. విదేశాల్లో నివసిస్తున్న బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తల్లితండ్రుల ఆశీర్వాదాలు లభిస్తాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.