సాయంత్రం వేళల్లో గోర్లు కత్తిరించడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

సాధారణంగా మన చేతి వేళ్ళకు పెరుగుతున్న గోర్లను తరచు కత్తిరించుకుంటు ఉంటారు. అంతే కాకుండ మరికొందరు ఎప్పుడు నోటితో గోర్లు కొరుకుతూ ఉంటారు. అయితే మన పెద్దవాళ్ళు మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు గోర్లు కత్తిరించకూడదని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం రోజున గోర్లు కత్తిరించకూడదని అలాగే ప్రతిరోజు సంధ్య సమయం తర్వాత కూడా గోర్లు కత్తిరించడం వల్ల అశుభం జరుగుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. సాయంత్రం వేళల్లో లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెడుతుంది. అందువల్ల అలాంటి సమయంలో గోర్లు కత్తిరించకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు.

అయితే ఇలా సాయంత్రం వేళల్లో గోర్లు కత్తిరించకూడదు అని చెప్పటానికి శాస్త్రీయంగా కూడా ఒక కారణం ఉంది. పూర్వం రోజుల్లో ఇప్పటిలాగా కరెంటు ఉండేది కాదు. కేవలం దీపాలను వెలిగించే వారు. అంతేకాకుండా పూర్వం గోర్లు కత్తిరించడానికి నెయిల్ కట్టర్స్ అందుబాటులో ఉండేవి కాదు. అందువల్ల బ్లేడు, కత్తి వంటి పదునైన వస్తువులతో గోర్లు కత్తిరించుకునేవారు. అలా చీకట్లో పదునైన వస్తువులతో గోర్లు కత్తిరించుకోవడం వల్ల పొరపాటున వేలు తెగే ప్రమాదం ఉంటుంది. అందువల్ల సాయంత్రం వేళల్లో గోర్లు కత్తిరించుకోకూడదు అని చెబుతూ ఉంటారు.

అయితే ఇలా శాస్త్రీయంగా సమాధానం చెబితే ఎవరు వినరు కాబట్టి.. అలా మన పెద్దలు దేవతల పేర్లు చెప్పి ప్రజలను నమ్మించేవారు. ప్రజలు కూడా ఇలా శాస్త్రానికి బదులు మూఢనమ్మకాలనే ఎక్కువగా నమ్మేవారు. మన చేతివేలి గోర్లలో ఎన్నో మలినాలు ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు చేతి గోర్లు కత్తిరించడం వల్ల గోర్లలో ఉండే అపరిశుద్ధమైన బ్రతకణాల వల్ల ఇంట్లో వాతావరణం కలుషితం అవుతుంది. అంతేకాకుండా పొరపాటున చిన్న పిల్లలు వాటిని నోటిలో పెట్టుకోవడం వల్ల వారు అనారోగ్యం పాలవుతారు. కనుక ఇంట్లో ఎప్పుడు పడితే అప్పుడు గోర్లు కత్తిరించకూడదని చెబుతూ ఉంటారు.