డిసెంబర్ 6th ఆదివారం మీ రాశి ఫ‌లాలు : గొప్ప ఆర్థిక వృద్ధి కోసం శ్రీ శివాభిషేకం చేయించండి

today December 6th 2020 daily horoscope in telugu

మేష రాశి : ఈరాశి పెండింగ్‌ పనులు పూర్తి !

కుటుంబ సభ్యలతో ఈరోజు ముఖ్యవిషయాలను చర్చిస్తారు. మీరు ఆకస్మికంగా పనికి సెలవుపెట్టి మీకుటుంబంతో సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. అందువలన మీరు మీస్నేహితులను ఆదుకోవాలని చూస్తారు. ఈరోజు మదుపు చెయ్యడం మానాలి. ఈరోజు పెండింగ్ పనులను పూర్తిచేస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.
పరిష్కారాలు: గొప్ప ఆర్థిక వృద్ధి కోసం శ్రీ శివాభిషేకం చేయించండి.

వృషభ రాశి : ఈరోజు అనవసర ఖర్చులు ఎదురవుతాయి !

అనవసర ఖర్చుల కోసం మీ ధనాన్ని ఖర్చు చేస్తారు. యాంత్రిక జీవితానికి పుల్‌స్టాప్‌ పెడుతారు. ఈరోజు సమయం విలువ తెలుసుకుంటారు. వైవాహిక జీవితంలో విషయంలో చాలా అంశాలు ఈ రోజు మీకు అద్భుతంగా జరగనున్నాయి. కుటుంబంలో మంచి వాతావరణాన్ని పెంపొందించుటకు మీరు ఈరోజు మీమనస్సును ప్రశాంతంగా ఉంచుతారు.
పరిష్కారాలు: మంచి ఆర్థిక జీవితం కోసం శ్రీలక్ష్మీకవచం పారాయణం చేయండి.

మిథున రాశి: ఈరోజు సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది !

ఈరోజు మీకు అనుకోని వారి నుంచి సహకారం లభిస్తుంది. దీంతోపాటు సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. సంతానం చదువుకొరకు ధనాన్ని వెచ్చించ వలసి ఉంటుంది. ఇంటిలో ముఖ్యమైన అవసరాల కోసం కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఈరోజు, మతపరమయిన కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలోనివారు మీతో ఆనందంగా గడుపుతారు. ఇంట్లో ఇష్టమైన విందు, వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది.

పరిష్కారాలు: ఆనందమైన జీవితం కోసం ధనలక్ష్మీ పూజ చేయండి.

కర్కాటక రాశి: ఈరోజు ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్త !

ఈరోజు గ్రహచలనాల రీత్యా ఆర్థికం వ్యవహారాలు జాగ్రత్త. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారికి ఈరోజు నష్టాలు తప్పవు. మీ ఆరోగ్యం జాగ్రత్త. మీ మూడీ ప్రవర్తన, మీ సోదరులతో/సోదరితో వివాదం రావచ్చు. మీరు కుటుంబము ప్రాముఖ్యతను కూడా దృష్టిలో ఉంచుకుని వీలైనంత సమయాన్ని వారితో గడపండి. ఈరాశిలో ఉన్న వ్యాపారస్తులకు, ట్రేడువర్గాలకు వారి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు.
పరిష్కారాలు: మంచి ఆరోగ్య ప్రయోజనాల కోసం శివుడికి పంచామృతాభిషేకం చేయండి.

సింహ రాశి : ఈరోజు వేడుకల్లో పాల్గొంటారు !

మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. ఈరోజు మీరు ఆర్థిక సంబంధిత సమస్యలు రావచ్చు. పెట్టుబడులు పెట్టేటప్పుడు మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. స్నేహితులు లేదా బంధువుల వేడుకల్లో పాల్గొంటారు. ఈరోజు మానసిక ప్రశాంతత పొందుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు అత్యంత స్పెషల్‌గా ఏదైనా మీకోసం చేస్తార.
పరిష్కారాలు: మీ ఆర్థిక స్థితిని మెరుగుపర్చడానికి నవగ్రహాలకు ప్రదక్షణలు, దానాలు చేయండి.

today December 6th 2020 daily horoscope in telugu

కన్యా రాశి: ఈరోజు సమస్యల నుంచి రిలీఫ్ !

ఈరోజు మీకు పెద్దల నుంచి సహకారం. ఊహించని విధంగా పెద్దల సహకారంతో సమస్యల నుంచి రిలీఫ్‌ దొరుకుతుంది. తెలియని ఆర్థిక లావాదేవీలతో జాగ్రత్త వహించండి. అనుకోని అతిథి మీ ఇంటికి రాక, పిల్లలతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. పరిష్కారాలు: ఆర్థిక వృద్ధి కోసం శ్రీసూక్తంతో అమ్మవారి పూజ చేయించండి.

తులా రాశి: ఈరాశి వారు ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్త !

ఈరోజు ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల ఉంటుంది. కొన్ని సమస్యల వల్ల ఆఫీస్‌లో మీరు ఇబ్బందులు పడుతారు. అనవసర విషయాల గురించి ఆలోచించకండి. పక్కవారు చెప్పే మాటలు వినకండి. దీనివల్ల కుటుంబసభ్యులు ఇబ్బంది పడుతారు. కుటుంబ జీవితం బాగుంటుంది. పరిష్కారాలు: మంచి ఆరోగ్యం కోసం సూర్యారాధన చేయండి.

వృశ్చిక రాశి: బంధువుల రాకతో ఇంట్లో సందడి !

ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి. బంధువుల రాకతో ఇంట్లో సందడి నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో భవిష్యత్‌ ప్రణాళికలు వేస్తారు. ఆర్థిక విషయాలు జాగ్రత్త. స్నేహితుల వల్ల మీరు బాగా ఇబ్బందికి గురవుతారు. కానీ అది మంచికే జరిగిందని ఆ తర్వాత మీరే గ్రహిస్తారు. భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. పరిష్కారాలు: మంచి ఆర్థిక వనరుల కోసం శ్రీలక్ష్మీగణపతిని గరికతో ఆరాధించండి.

ధనుస్సు రాశి: ఈరోజు ఆరోగ్యం కోసం విశ్రాంతి తీసుకోండి !

గ్రహచలనాల రీత్యా మీరు పొదుపు చేయలేకపోతారు. మీ ఆలోచనలు ముందుకు సాగవు. అయినప్పటికీ మీరు దిగులుపడాల్సిన పనిలేదు, ఈ పరిస్థితి నుండి మీరు తొందరగా బయటపడతారు. మీశారీరక శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకొండి. దీనివల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజు ఆనందంగా గడపబోతున్నారు. వైవాహికంగా బాగుంటుంది. పరిష్కారాలు: ఆర్థిక పరిస్థితిని బాగుపడేందుకు శ్రీలక్ష్మీ స్తోత్రం పారాయణం చేయండి.

మకర రాశి : తోబుట్టువుల సహాయం అందుకుంటారు !

ఈరోజు చంద్రగ్రహ ప్రభావంతో తోబుట్టువుల సహాయం అందుకుంటారు. దీనివల్ల మీరు ఆర్ధిక ప్రయోజనాలను పొందుతారు. పెండింగ్ సమస్యలు పరిష్కారానికి ప్రయత్నిస్తారు. దీనికోసం మీ శ్రమను ఈరోజే మొదలు పెట్టండి. ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది. పరిష్కారాలు: మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందటానికి శివరాధన చేయండి.

కుంభ రాశి : ఆర్థికంగా బాగుండే రోజుల్లో ఈరోజు ఒకటి కానుంది !

ఈరోజు ధనానికి విలువ ఇవ్వవలసి ఉంటుంది, మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు వత్తిడికి కారణం కావచ్చును. మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ. ఈరోజు మీకు రావాల్సిన ధనం మీ చేతికి అందుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు. పరిష్కారాలు: సూర్యారాధన చేయడం వల్ల ారోగ్యం బాగుంటుంది.

మీన రాశి : ఈరోజు మీ వస్తువులు జాగ్రత్త !

ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి. ఆఫీస్‌కు సంబంధించి పెద్దవ్యక్తుల సహాయం మీకు పెద్ద ప్రోత్సాహంగా ఉంటుంది. మీ విలువైన వస్తువును దొంగిలించే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీవస్తువుల పట్ల జాగ్రత్త అవసరము. విద్యార్థులు సమయాన్ని వృధాచేయకండి. సమయం చాల విలువైనది అని మర్చిపోకండి. భాగస్వామి ద్వారా మీకు ఓ చక్కని సర్ ప్రైజ్ తప్పదనిపిస్తోంది. పరిష్కారాలు: పూజగదిలో శ్రీసూక్తంతో ఆరాధన చేయండి.